యుజీఈటీ 2022 కోసం కొమెడ్ కె యుని–గేజ్ ప్రవేశ పరీక్ష : అప్లికేషన్ తేదీల ప్రకటన
TeluguStop.com
దేశవ్యాప్తంగా 4వేల కేంద్రాల్లో 80వేల మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా మార్చి 23,2022 : కొమెడ్ కె యుజీఈటీ మరియు యుని–గేజ్ ప్రవేశ పరీక్షలు జూన్ 19,2022 ఆదివారం జరుగనున్నాయి.
దాదాపు 190 ఇంజినీరింగ్ కళాశాలలు మరియు 50కు పైగా సుప్రసిద్ధ ప్రైవేట్ మరియు డీమ్డ్ యూనివర్శిటీలలో ప్రవేశాల కోసం ఉమ్మడి పరీక్షగా దీనిని నిర్వహించనున్నారు.
ఈ ప్రవేశ పరీక్షలు కర్నాటక ప్రొఫెషనల్ కాలేజీస్ ఫౌండేషన్ ట్రస్ట్ మరియు యుని–గేజ్ సభ్య యూనివర్శిటీలలో బీఈ/బీటెక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో భారతదేశ వ్యాప్తంగా 150 నగరాలలో 400కు పైగా టెస్ట్ కేంద్రాలలో నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం ఈ పరీక్షల కోసం 80వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని అంచనా.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు Www!--comedk!--org Or !--wwwunigauge!--com వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది, ఈ అప్లికేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో తెరిచారు.
మే 02 వ తేదీ వరకూ దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ సందర్భంగా కొమెడ్ కె ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ కుమార్ మాట్లాడుతూ ‘‘గత ఐదు దశాబ్దాలుగా ఉన్నత విద్య కేంద్రంగా కర్నాటక నిలుస్తుంది.
ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే అభ్యర్థులకు ఇది ప్రాధాన్యతా కేంద్రంగా నిలుస్తుంది.ఇటీవలి కాలంలో విద్యార్థుల సంఖ్య పరంగా గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది.
కొమెడ్ కె గత 15 సంవత్సరాలుగా ఈ పరీక్షలను నిర్వహిస్తుంది.ఈ సంవత్సరం కూడా భద్రతా చర్యలను పరిగణలోకి తీసుకుని ఈ పరీక్షలను నిర్వహించనున్నాం’’ అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ‘‘ ఎన్‌ఈపీ 2020కు అనుగుణంగా తాము కొమెడ్ కేర్స్ అడ్వాన్స్‌డ్ స్క్చిల్ సెంటర్లను ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ప్రారంభించాము.
వీటి ద్వారా వారు నూతన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల పట్ల పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు’’ అని అన్నారు.
జీఆర్‌ఈ ఏ విధంగా అయితే ఒకే వేదికగా ఉపయోగపడుతుందో అదే రీతిలో యుని–గేజ్ ను సైతం ఒకే పరీక్షగా భారతదేశంలోని అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి మార్చాలన్నది మా ప్రయత్నం.
విద్యార్ధులకు సౌకర్యవంతమైన, సురక్షిత వాతావరణంలో పరీక్షలను నిర్వహిస్తున్నాం.మహమ్మారి పరిస్థితులలో సైతం 400 కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహించనున్నాం’’ అని ఎరా ఫౌండేషన్ సీఈవొ పీ మురళీధర్ అన్నారు.
పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి ‘ కేటీఆర్ సెటైర్లు