హాస్యబ్రహ్మపై విద్యుల్లేఖ కామెంట్స్…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్…!

వెండితెరపై తెలుగు, తమిళ పరిశ్రమలో మంచి కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి విద్యుల్లేఖ రామన్.

ఆమె నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.తక్కువ సమయంలోనే కమెడియన్ గా విద్యుల్లేఖ తనదైన ముద్ర వేసుకుంది ఈ భామ.

ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షుకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఇప్పడు స్టార్ కమిడియన్ జాబితాలో ఒక్కరిగా చేరారు.

ఇక లావుగా బొద్దుగా కనిపించే ఈ భామ లాక్ డౌన్ సమయంలో వర్క్ అవుట్ చేసి స్లిమ్ గా కనిపించి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.

అయితే ఈ భామ రీసెంట్ గా నిడారంబరంగా నిశ్చితార్థం చేసుకొని ఆమెకు కాబోయే భర్తను పరిచయం చేశారు.

తాజాగా ఆమె అమెజాన్ ప్రైమ్ లో స్టాండప్ కామెడీ షో చేస్తున్నారు.

అయితే ఈ షోను అర్జున్ కార్తికేయన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ కామెడీ షో తమిళంలో ఉంది.

ఈ షో గురించి ప్రమోట్ చేయడానికి ఆమె పలు ఇంటర్వూలు ఇచ్చారు.అయితే ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.

బ్రహ్మానందం చేసిన స్టాండప్ కామెడీ షో చూసినట్లు తెలిపారు.అంతేకాకుండా షోలో ప్రజంటేషన్ సరిగ్గా లేదంటూ తెలిపారు.

ఇక ఆ షోకి సంబంధించిన కంటెంట్‌ను సరిగా తీసుకోలేదన్నారు.ఆ షోకి సరిగ్గా హోంవర్క్ చేయలేదని ఆమె అన్నారు.

అయితే ఇది కేవలం స్టాండింగ్ కామెడీ‌లోని బేసిక్ కంటెంట్ ను వారు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ కారణంగానే ఈ షో పెద్దగా సక్సెస్ కాలేదని ఆమె అన్నారు.అయితే కామికి‌స్థాన్‌ తమిళ్‌లో షో కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా ఈ షో ప్రేక్షకుల ఆకట్టుకుంటుందనే నమ్మకం ఆమెకు ఉన్నట్లు తెలియజేసింది.ఇక బ్రహ్మానందం షోను మా షోను పోల్చి చుడొదంటూ విద్యుల్లేఖ రామన్ అన్నారు.

దింతో విద్యుల్లేఖ రామన్ పై బ్రహ్మీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

కెనడా ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై కుప్పలుగా ఈల్ చేపలు.. వీడియో చూస్తే షాకే…