నాలుగు స్తంభాలాట సినిమాలో ఆయన వేసి సుత్తి పాత్రకు గాను సుత్తి వేలు అనే పేరు వచ్చింది.
ఇక చిన్నతనంలో చాల పీలగా ఉండేవారట అందుకే అందరు వేలు అంత లేవు అంటూ వేలు అని పిలిచేవారట.
ఆలా సుత్తివేలు గా అయన పేరు మారిపోయింది/ అదే పేరు చివర కొనసాగింది.
అందరు అయన అసలు పేరు మర్చిపోయి స్క్రీన్ నేమ్ లాగ ఇదే పేరును కొనసాగించారు.
ముద్దా మందారం సినిమాతో జంధ్యాల సినిమా అవకాశం ఇచ్చారు , డాక్ యార్డ్ లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ నాటకాలు వేస్తూ తనలోని నటుడిని బ్రతికించు కునేవారు.
"""/" /
జంధ్యాల గారి సినిమాల్లో మొదట్ల ఎక్కువగా కనిపించేవారు .సుత్తి వేలు కామెడీ టైమింగ్ అంటే అందరికి చాల ఇష్టం ఉండేది.
నాలుగు స్తంభాలాట సినిమా లో నటించిన సుత్తివేలు ఆ చిత్రం కోసం ఎక్కువ రోజులు పని చేయాల్సి రావడం తో ఉద్యోగంలో నుంచి తీసేసారు.
ఇక సినిమాల్లో నటిస్తూ మద్రాసులోనే స్థిర నివాసం సైతం ఏర్పరుచుకున్నారు.అయితే అందరు మద్రాసు నుంచి హైదరాబాద్ కి తరలి వచ్చినప్పుడు అయన మాత్రం అక్కడే ఉండిపోవడం తో చివరి రోజుల్లో ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు.
అయన నటించిన చివరి సినిమా అందరికి వందనాలు.200 కు పైగా సినిమాల్లో నటించిన సుత్తి వేలు కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు.
2012 లో సుత్తి వేలు ఈ లోకాన్ని వీడి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
"""/" /
అవకాశాల కోసం చివరి రోజుల్లో అయన తన మకాం ని హైదరాబాద్( Hyderabad ) కి మార్చిన పెద్ద ఉపయోగం లేకుండా పోయింది.
అయన కు భార్య లక్ష్మి రాజ్యం ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కొడుకు కూడా ఉన్నారు.
కూతుళ్లు శ్రీదేవి, భువనేశ్వరి, సత్యవాణి, కొడుకు జగన్నాధ ఫణి కుమార్ తో కలిసి అయన తీసియించుకున్న ఫోటో ఈ ఆర్టికల్ లో మీరు చూడవచ్చు.
కత్తులాంటి చూపులతో ఇద్దరు కూతుళ్లను ఒడిసి పట్టుకొని కూర్చున్నారు.ఇక అయన కుటుంబం నుంచి ఎవరిని సినిమా ఇండస్ట్రీ కి రానివ్వలేదు సుత్తివేలు.
ఇండియా లైఫ్‌స్టైల్ బెస్ట్ అంటున్న కెనడా ఎన్నారై.. కారణం తెలిస్తే అవాక్కవుతారు…