పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఫోన్ చేస్తే అలా రియాక్ట్ అయ్యారు: కమెడియన్ సుధాకర్
TeluguStop.com
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో సుధాకర్ ( Sudhakar ) ఒకరు.
అక్కడ స్టార్ హీరోగా తమిళ చిత్ర పరిశ్రమను ఏలుతున్న సమయంలో కొందరు ఈయనని కెరియర్ పరంగా తొక్కేశారు.
ఇలా అవకాశాలు లేకుండా చేయటంతో సుధాకర్ తప్పనిసరి పరిస్థితులలో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ కమెడియన్ గా స్థిరపడ్డారు.
ఇలా సుధాకర్ కమెడియన్ గా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇటీవల కాలంలో ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు.
"""/" /
ఇలా ఇండస్ట్రీకి దూరమైన సుధాకర్ మరణించారు అంటూ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇలా వార్తలు వచ్చిన ప్రతిసారి నేను బ్రతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన పరిస్థితి సుధాకర్ కి ఎదురైంది.
ఇకపోతే ఇటీవల తన కుమారుడు బెన్నీ ( Benny ) సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఈయన కూడా పలు బుల్లితెర కార్యక్రమాలకు అలాగే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు.
నడవలేని స్థితిలో ఉన్న సుధాకర్ వీల్ చైర్ లోనే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
"""/" /
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన కెరియర్ గురించి, అలాగే తన కొడుకు సినీ ఎంట్రీ గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు చిరంజీవి( Chiranjeevi ) తో పాటు ఇతర హీరోలతో కూడా ఎంతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ).గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నన్ను చాలా ఆప్యాయంగా అన్నయ్య అంటూ పిలిచేవారు.
ఇక మా ఆవిడను వదినా అని ఎంతో ప్రేమగా పిలిచేవారని తెలిపారు.ఇక నాకు చిరంజీవి ఎంతో పవన్ కళ్యాణ్ కూడా అంతేనని సుధాకర్ తెలిపారు.
ఇక ఆయన ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించి డిప్యూటీ సీఎం అయిన తర్వాత తాను ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని ఆ సమయంలో పవన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని సుధాకర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
చనిపోయిన భర్త అస్తికలు తిన్న భార్య.. ఎందుకో తెలిస్తే..?