NTR Relangi: ఆ రూపంలో ఉన్న ఎన్టీఆర్ ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి చెయ్యి చూసిన కమీడియన్ రేలంగి.. ఏం చెప్పారో తెలుసా ?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా అందరు నోటా జై శ్రీరామ్ అనే నినాదం తప్ప మరొకటి లేదు.

బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో( Ayodhya ) అంగరంగ వైభవంగా జరిగింది.

ఆ ముచ్చట్లు టీవీలో లక్షల మంది నుంచి కోట్ల మంది కూడా వీక్షించారు.

నేరుగా అయోధ్యకు వెళ్లిన వారికి కూడా రాముడు దర్శన భాగ్యం( Shri Ram Darshan ) లభించింది.

అయితే మన తెలుగు వారందరికీ రాముడైనా, కృష్ణుడైన ఒకే ఒక్కడు.అతడే మహా పురుషుడైన నందమూరి తారక రామారావు గారు( Nandamuri Taraka Ramarao ) ఆయన రాముడి రూపంలో లేదా కృష్ణుడు రూపంలో ఉన్న పటాలని దేవుళ్ళుగా భావించడం మనకు ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ.

"""/" / అది లవకుశ సినిమాకి( Lava Kusa Movie ) ముహూర్తం షార్ట్ పెట్టుకుంటున్న రోజు.

రాముడి కటౌట్ లో ఎన్టీఆర్ కి మేకప్ వేశారు.ఆయన అలా నడుచుకుంటూ వస్తున్న షార్ట్ తీయాలనుకున్నారు దర్శకుడు పుల్లయ్య.

అలా వస్తున్న ఆయనను చూసి అందరూ అచ్చం శ్రీరామచంద్రుడు( Sri Rama Chandra ) లాగానే ఉన్నారు అంటూ భక్తి భావంతో చప్పట్లు కొట్టారు.

అక్కడే ఉన్న కమెడియన్ రేలంగి( Comedian Relangi ) అయితే ఆనందాన్ని పట్టలేకపోయారు.

అలా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎన్టీఆర్ ని ఆలింగనం చేసుకొని శ్రీరామచంద్రుడిలా ఉన్నారు అంటూ ఎంతో పొంగిపోయారు.

అలాగే ఆయన చెయ్యి ని ఇలా ఇవ్వండి అంటూ హస్త సాముద్రికం లో ఎంతో జ్ఞానం ఉన్న రేలంగి భవిష్యత్తును కూడా చెప్పారట ఎన్టీఆర్ గారికి.

"""/" / 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా మీరు ఎన్నో అద్భుత శిఖరాలను అధిరోహిస్తారని దేశం గర్వపడే స్థాయిలో ఉంటారని ఆ రోజు ఈ రేలంగిని గుర్తుంచుకోవాలని చెప్పారట.

అక్కడే ఉన్న అంజలీ దేవి( Anjali Devi ) సీత రూపంలో తధాస్తు అని చెప్పారట.

ఆయన చెప్పినట్టుగానే 50 ఏళ్ల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి భారత దేశంలోనే ఒక గొప్ప రికార్డును సృష్టించారు.

లవకుశ సినిమా తీసే టైం కి ఎన్టీఆర్ కి కేవలం 40 ఏళ్ళు మాత్రమే.

ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోనూ అలాగే రాజకీయాల్లోనూ అమోఘమైన రికార్డ్లను సృష్టించడంలో ఆయన తర్వాతే ఎవరైనా.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలివే.. వెంకీ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లా?