నాగ్ కోసం డబ్బులు ఖర్చు చేసి మోసపోయా.. కమెడియన్ షాకింగ్ కామెంట్స్!

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో రాము ఒకరు.అదిరే అభి టీంలో చేయడం ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న రాము కొరియోగ్రాఫర్ గా కూడా పని చేస్తూ తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.

అయితే రాము ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాగార్జున కోసం డబ్బులు ఖర్చు చేసి మోసపోయానని రాము చెప్పుకొచ్చారు.నేను డ్యాన్స్ నేర్చుకుని డ్యాన్స్ బేబీ డ్యాన్స్ జూనియర్స్ లో చేశానని రాము చెప్పుకొచ్చారు.

అప్పట్లోనే నేను ఒక సినిమా అడిషన్ కు వెళ్లానని డబ్బులు అడగడంతో నేను చేయలేనని చెప్పానని రాము తెలిపారు.

ఒక స్టార్ డైరెక్టర్ నన్ను రూ.3 లక్షలు అడగగా 3,000 రూపాయలు కూడా ఇవ్వలేనని నేను చెప్పానని ఆయన కామెంట్లు చేశారు.

ఆ డైరెక్టర్ పేరు చెప్పడం ఇష్టం లేదని రాము తెలిపారు. """/"/ అన్నపూర్ణ స్టూడియోస్ లో నేను ఏడుస్తున్న సమయంలో నాగార్జునగారు కలిశారని రాము తెలిపారు.

నాగ్ సార్ అరుస్తా ఉన్నారని సిగరెట్ ఎక్కడ అని అడుగుతుండగా నేను సిగరెట్ కొనిచ్చి నా సమస్య చెప్పానని రాము చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత నాగార్జున కూల్ డ్రింక్ అంటుంటే కూల్ డ్రింక్ కొనిచ్చానని రాము కామెంట్లు చేశారు.

ఆ తర్వాత ఆయన రియల్ నాగార్జున కాదని డూప్ నాగార్జున అని చెప్పారని రాము పేర్కొన్నారు.

"""/"/ ఆ విషయం తెలిసి నాకు అసలు విషయం అర్థమైందని ఆ డూప్ నాగార్జున పేరు శివ అని రాము చెప్పుకొచ్చారు.

ఈ ఘటన జరిగి 13 సంవత్సరాలైందని రియల్ నాగార్జునకు చెప్పి ఆ డబ్బులు వసూలు చేసుకుంటానని రాము అన్నారు.

రాము చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.రాము కమెడియన్ గా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇండియా లో ప్రస్తుతం ప్రభాసే నెంబర్ వన్ హీరోనా..?