ప్ర‌ముఖ క‌మెడియ‌న్ రాజు శ్రీవాస్త‌వ క‌న్నుమూత

ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ (58) క‌న్నుమూశారు.గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న‌.

తుదిశ్వాస విడిచారు.ఆగస్టు 10వ తేదీన జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా ఛాతిలో నొప్పి రావ‌డంతో అక్కడికక్కడే కుప్పకూలారు.

దాంతో ఆయన‌ను కుటుంబ‌స‌భ్యులు ఎయిమ్స్‌కు త‌రలించారు.ఈ క్ర‌మంలో 40 రోజులుగా చికిత్స పొందుతున్న శ్రీవాస్త‌వ ఈరోజు మృతిచెందార‌ని కుటుంబ సభ్యులు వెల్ల‌డించారు.

పోలీసుల ఎంట్రీతో.. లేడీ అఘోరీ చెర నుంచి శ్రీవర్షిణికి విముక్తి!