పవన్ దమ్ము, ధైర్యం గురించి రోజా మాట్లాడటం ఏంటి.. పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్( Prithviraj ) ప్రస్తుతం మళ్లీ వరుసగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

పృథ్వీరాజ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉందని ప్రచారం జరుగుతుండగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పృథ్వీకి జనసేన టికెట్ దక్కని పక్షం ఆయన కేవలం జనసేన పార్టీ ప్రచారానికి పరిమితం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

"""/" / అయితే వైసీపీ మంత్రి రోజా తాజాగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) దమ్ము, ధైర్యం గురించి షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

రోజా పవన్ కళ్యాణ్ పై ఘాటుగా విమర్శలు చేయగా ఆ విమర్శలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యాయి.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రోజా గురించి ఎలాంటి కామెంట్లు చేయలేదు.తాజాగా పృథ్వీరాజ్ రోజాను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా ఆ విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

మనం ఏమైనా కబడ్డీ ఆడుతున్నామా? దమ్ము, ధైర్యం గురించి రోజా ప్రశ్నించడం ఏంటని పృథ్వీరాజ్ అన్నారు.

దమ్ము, ధైర్యాలు మాకు వద్దని మేము వీధి రౌడీలం కాదని మీ దమ్ము మీరు చూపించాలని మా దమ్ము మేము చూపిస్తామని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

ఏపీ ప్రజలు తండ్రి లేని బిడ్డ అని జగన్ కు ఛాన్స్ ఇచ్చారని స్వల్ప మెజారిటీతో గత ఎన్నికల్లో 65 సీట్లలో వైసీపీ గెలిచిందని ఆయన తెలిపారు.

"""/" / ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జనసేన( JanaSena Party )కు అనుకూలంగా తీర్పు ఉంటుందని పృథ్వీరాజ్ వెల్లడించారు.

నాలుగున్నర సంవత్సరాలలో వైసీపీ ఏం చేసిందని ఆయన అన్నారు.వైసీపీ బూతుల రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముందని పృథ్వీరాజ్ వెల్లడించారు.

పులివెందులలో కూడా వైసీపీకి అనుకూలంగా లేదని ఆయన తెలిపారు.రాజంపేట, రైల్వే కోడూరు, కడప ఎంపీ సీటు జనసేనకు అనుకూలంగా ఉందని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

చైనాలో విజయ్ సేతుపతి మూవీ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే అన్ని రూ.కోట్లా?