ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం… ఫాలోయింగ్ మామూలుగా లేదుగా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఒకరు.

ఈయన కొన్ని వందల సినిమాలలో నటించి తన అద్భుతమైన హాస్యంతో నటనతో ప్రేక్షకులు అందరినీ కూడా కడుపుబ్బ నవ్వించారు.

కొన్ని సినిమాలు బ్రహ్మానందం గారి కామెడీ వల్లే సక్సెస్ అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు.

అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయనని మించిన హాస్యనటుడు( Comedian ) లేరని చెప్పాలి.

ఇలా ఒకానొక సమయంలో ఏడాదికి ఒక 10 సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ ఉండే బ్రహ్మానందం( Brahmanandam ) ఇటీవల కాలంలో పూర్తిస్థాయిలో సినిమాలను తగ్గించారు.

"""/" / వయసు పై బడుతున్న నేపథ్యంలోనే తాను సినిమాలను తగ్గించానని అంతేక తప్ప అవకాశాలు రాక కాదు అంటూ ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

అప్పుడప్పుడు మనం మన శరీరాన్ని కూడా పట్టించుకోవాలని వయసు పైబడటంతోనే తాను సినిమాలు చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇక బ్రహ్మానందం సినిమాలను కాస్త తగ్గించిన ప్రతిరోజు సోషల్ మీడియాలో ఈయన నటించిన సినిమాలలోని కొన్ని సన్నివేశాలతో మీమ్స్( Memes )చేస్తూ అభిమానులను మీమర్స్ నవ్విస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ విషయంలో బ్రహ్మానందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అభిమానులు నా సినిమాలన్నింటిని గుర్తు పెట్టుకొని ఇలా మీమ్స్ చేస్తుంటే నాకు బాధ లేదని వారి అభిమానానికి నాకు సంతోషంగా ఉందని తెలిపారు.

"""/" / ఇలా బ్రహ్మి లేని తెలుగు మీమ్ కంటెంట్‌ను ఊహించలేని పరిస్థితి.

సోషల్ మీడియాలో ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తే ఆ అభిమానులకు ఇక పండుగ అని చెప్పాలి.

తాజాగా బ్రహ్మానందం ఇంస్టాగ్రామ్( Brahmanandam Instagram ) లోకి అడుగుపెట్టారు.Yourbrahmanandam ఐడీతో ఆయన ఇన్‌స్టాలోకి వచ్చారు.

తన కొడుకు గౌతమ్‌తో కలిసి నటించిన 'బ్రహ్మానందం'కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించడంతో క్షణాలలో ఈయనకు భారీ స్థాయిలో ఫాలోవర్స్ పెరిగిపోయారు.

ఈయన ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు అలాగే ఎవరిని కూడా ఫాలో కాలేదు కానీ బ్రహ్మానందం గారికి మాత్రం ఇంస్టాగ్రామ్ లో సుమారు 163K ఫాలోవర్స్ ఉండటం విశేషం.

మరి ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటూ తన మీద వచ్చే మీమ్స్ పట్ల బ్రహ్మానందం స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సింది.