ఆసుపత్రిలో చేరిన బ్రహ్మానందం ! అసలు ఏమైంది అంటే..?
TeluguStop.com
సినిమాల్లో కామెడీ చేస్తూనే అగ్ర హీరోల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా స్టార్ డమ్ అనుభవిస్తున్న కామెడియన్ బ్రహ్మనందం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజాగా.ఆయనకు గుండె నొప్పి రావడంతో.
హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వైద్యులు వెంటనే బైపాస్ సర్జరీ చేశారు.
2019, జనవరి 15వ తేదీ మంగళవారం సంక్రాంతి పండుగ రోజు బ్రహ్మానందం అనారోగ్యానికి గురయ్యారు.
శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడ్డారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.
పరిశీలించిన డాక్టర్ తక్షణమే సర్జరీ చేయాలని చెప్పటంతో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌కు తీసుకెళ్లారు.
అక్కడ బ్రహ్మానందంకు సర్జరీ చేశారు.ఆసుపత్రిలోని ప్రముఖ కార్డియాక్ సర్జన్ రామకుంట పాండ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది.
ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.వారం రోజుల తర్వాత బ్రహ్మానందాన్ని డిశార్జ్ చేస్తామని డాక్టర్ రామకుంట పాండ తెలిపారు.