ఆ ముగ్గురు చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. కమెడియన్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ కమెడియన్ బబ్లూ( Comedian Bablu ).నీ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమాలు చిత్రం, ఆర్య.

ఈ రెండు సినిమాలతో బాగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు బబ్లూ.

అంతేకాకుండా తనదైన శైలిలో కామెడీ చేసి కడుపుబ్బా నవ్వించారు.అలా తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించాడు బబ్లూ.

ఇది ఇలా ఉంటే గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న బబ్లూ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి మళ్ళీ సినిమాలలో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బబ్లూ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఈ సందర్భంగా బబ్లూ మాట్లాడుతూ. """/" / నా మొదటి చిత్రం ముద్దుల మేనల్లుడు( Muddula Menalludu ).

అప్పుడు నా వయసు 5 ఏళ్లు.అందులో నాజర్‌ కొడుకిగా నటించాను.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశాను.11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సీరియల్‌ చేశాను.

నా అసలు పేరు సదా ఆనంద్‌( Sada Anand ).ఈ సీరియల్‌ చేసేటప్పుడు జంధ్యాల గారు బబ్లూ అన్న పేరు పెట్టారు.

అప్పటినుంచి అదే పేరు స్థిరపడిపోయింది.నేను 10వ తరగతి చదివేటప్పుడు చిత్రం మూవీ చేశాను.

ఆ సినిమాతో బోలెడన్ని అవకాశాలు వచ్చాయి.మా నాన్న బాడీ బిల్డర్‌.

ఆయన సినిమాలు చేయాలని ఎంతో ప్రయత్నించాడు.కానీ కుదర్లేదు.

అయితే చిత్రం సినిమా లో నాతో పాటు ఒక సాంగ్‌లో నటించాడు.అలాగే 2012లో నాన్న చనిపోయాడు.

"""/" / గత ఏడాది చెల్లి కూడా మరణించింది.ఈ ఏడాది జనవరిలో నాన్న సోదరి కొడుకు చనిపోయాడు.

అలా నాకు ఇష్టమైన ముగ్గురు చనిపోయారు.మా నాన్న మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.

అప్పుడు ఆఫర్స్‌ వదిలేసుకున్నాను.బ్యాంకాక్‌ వెళ్లిపోయి రెండేళ్లకు పైగా అక్కడే ఉన్నాను.

అలా సినిమాలకు దూరమయ్యాను.ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టాను.

ప్రస్తుతం సొంతంగా ఒక ప్రాజెక్ట్‌ కూడా చేస్తున్నాను.అలాగే యాక్టింగ్‌ అకాడమీ లోనూ పని చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు బబ్లూ.

హ్యాండ్‌స్టాండ్ ట్రిక్‌తో కళ్లముందే మాయం.. ఇదెలా చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు!