గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కమెడియన్ బబ్లూ.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే..
TeluguStop.com
తేజ( Teja ) దర్శకత్వం వహించిన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన కమెడియన్ బబ్లూ( Comedian Bablu ).
ఈ హాస్యనటుడు పలు చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు ప్రఖ్యాతులు పొందలేదు.చాలా కాలంగా వెండితెరపై అతడు కనిపించిన దాఖలాలు లేవు.
నిజానికి అతను చాలా కాలం పాటు నటనను విడిచిపెట్టాడు.దానికి ప్రధాన కారణం అతడు పర్సనల్ లైఫ్ లో అనేక ట్రాజడీలను ఎదుర్కోవడమే.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను సినీ పరిశ్రమకు దూరంగా ఉండటానికి గల కారణాలను బబ్లూ వెల్లడించాడు.
2012లో తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలో తన తండ్రిని కోల్పోయానని బబ్లూ చెప్పాడు.
చాలా కాలంగా డిప్రెషన్‌లో ఉండి పనిపై దృష్టి పెట్టలేకపోయానని వెల్లడించాడు.ఆ తర్వాత 2022లో అనారోగ్యం కారణంగా తన సోదరిని కోల్పోయినట్లు తెలిపాడు.
ఈ రెండు పర్సనల్ లాసుల వల్ల మానసికంగా కృంగిపోయినట్లు తెలిపాడు.సిస్టర్ చనిపోయాక చాలా లోన్లీగా అనిపిస్తోందంటూ వాపోయాడు.
సరిగ్గా అలాంటి సమయంలోనే అతను ఇటీవల తన మేనత్త కొడుకును కూడా కోల్పోయాడు.
ఈ సంఘటనలు తనకు నటనపై, జీవితంపై ఆసక్తిని కోల్పోయేలా చేశాయన్నాడు. """/" /
తన డిప్రెషన్‌ను తట్టుకునేందుకు బ్యాంకాక్( Bangkok ) వెళ్లి అక్కడ డీజేగా పనిచేశానని చెప్పాడు.
ప్రస్తుతం ఫిలిం అకాడమీలో( Film Academy ) ఫ్యాకల్టీగా పనిచేస్తున్నట్లు తెలిపాడు.
ఔత్సాహిక నటీనటులు, దర్శకనిర్మాతలకు సినిమా క్రాఫ్ట్ గురించి నేర్పిస్తున్నట్లు పేర్కొన్నాడు.త్వరలో చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
తన వయసుకు, అనుభవానికి తగ్గట్టుగా మంచి స్క్రిప్ట్‌లు, పాత్రల కోసం చూస్తున్నట్లు తెలిపారు.
"""/" /
బబ్లూ గతంలో అల్లు అర్జున్‌తో ఆర్య, పవన్ కళ్యాణ్‌తో ఖుషీ వంటి కొన్ని ప్రముఖ సినిమాల్లో నటించాడు.
అయితే స్టార్ కమెడియన్ గా గానీ , లీడ్ యాక్టర్ గా గానీ అతనికి గుర్తింపు రాలేదు.
అవకాశాలు లేకపోవటం, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను లైమ్‌లైట్‌కు దూరంగా ఉండవలసి వచ్చింది.
అయితే సినిమా పరిశ్రమ అనూహ్యమైనదని, అవకాశాలు వచ్చినప్పుడు నిరూపించుకోవాలని చెబుతూ బబ్లూ తన ఇంటర్వ్యూ ముగించాడు.
అయితే ఈ నటుడి కామెడీని బాగా ఇష్టపడే టాలీవుడ్ ఆడియన్స్ అతడు త్వరగా రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
మళ్లీ పవన్, అల్లు అర్జున్ వంటి సినిమాల్లో కనిపిస్తే బాగుంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.
వాలెంటైన్స్ వీక్‌లో సింగిల్స్‌కి అదిరిపోయే ఆఫర్.. రూ.100కే గర్ల్‌ఫ్రెండ్స్.. బాయ్‌ఫ్రెండ్స్..!