నటుడు ప్రభాకర్ పై సీరియస్ అయిన జబర్దస్త్ కమెడియన్.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటుడు ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు ప్రభాకర్.
కేవలం నటుడుగా మాత్రమే కాకుండా స్వీయ దర్శకత్వం నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టారు.
అంతేకాకుండా నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్రణ వేసుకున్నాడు ప్రభాకర్.
కేవలం సీరియల్స్ లో మాత్రమే కాకుండా వెండితెరపై సినిమాలలో కూడా నటించి మెప్పించాడు.
అలా బుల్లితెరపై అంచలంచెలుగా ఎదిగిన ప్రభాకర్ బుల్లితెర మెగాస్టార్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పటికీ సీరియల్స్ లో నటిస్తూ ఇది బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటేనే ప్రభాకర్ ఇటీవల తన కొడుకు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో చంద్రహాస్ యాటిట్యూడ్ చూపించడంతో నెటిజెన్స్ భారీగా ట్రోలింగ్స్ చేశారు.అయితే మొదట్లో నా కొడుకు పై ట్రూల్స్ చేయొద్దు అని వేడుకున్న ప్రభాకర్ ఆ తర్వాత ఆ ట్రోల్స్ వల్లే తన కొడుకు హీరో కాకముందే బాగా పాపులర్ అవ్వడంతో నెటిజన్స్ కి థాంక్స్ అని చెప్పుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆదివారం స్టార్ మా పరివారం షోలో కృష్ణ ముకుందా మురారి సీరియల్ తరపున ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ క్రమంలోని షోలో అందరితో కలిసి సందడి సందడి చేశారు.ఆ తర్వాత సరదా సరదాగా సాగుతుండగా ఆఖరిలో ఎందుకురా నీకు అంత యాటిట్యూడ్ అని అవినాష్ ను ప్రభాకర్ అనడంతో వెంటనే అవినాష్ మీ అబ్బాయికి ఎందుకు అంత యాటిట్యూడ్ అంటూ తిరిగి ప్రశ్నించాడు.
"""/"/
దాంతో ప్రభాకర్ తో పాటు అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆ తర్వాత అన్న రా ఒక నిమిషం ఇటు రండి అని అవినాష్ పిలవగా అప్పుడు అక్కడికి వచ్చిన ప్రభాకర్ ని ఆటిట్యూడ్ తగ్గించుకో అని సీరియస్ గా చెప్పడంతో షాక్ అయిన అవినాష్ ఆటిట్యూడ్ నాకు లేదు అర్థం అయిందా అని అవినాష్ అన్నాడు.
మరి ఎవరికి ఉంది రా అని ప్రభాకర్ అడగడంతో నీకుంది మీ ఫ్యామిలీకి ఉంది అర్థమైందా అని సీరియస్ గా కామెంట్స్ చేశాడు అవినాష్.
దాంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
హత్య సినిమా రివ్యూ అండ్ రేటింగ్!