కొత్త కారు కొన్న జబర్దస్త్ అవినాష్.. అమ్మ ఆస్పత్రిలో ఉంటే కారు కొంటావా అంటూ?
TeluguStop.com
జబర్దస్త్ ( Jabardasth )షో ద్వారా పాపులర్ అయిన అవినాష్ ప్రస్తుతం టీవీ షోల కంటే వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
గతంతో పోలిస్తే అవినాష్ కు సినిమా ఆఫర్లు సైతం తగ్గుతున్నాయి.అయితే తాజాగా జబర్దస్త్ అవినాష్ కొత్త కారు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ఈ కారు ఖరీదు ఏకంగా 25 లక్షల రూపాయలు కావడం గమనార్హం.సాధారణం సెలబ్రిటీలు ఎవరైనా కారు కొంటే ప్రశంసలు దక్కుతాయి.
"""/" /
అయితే అవినాష్( Avinash ) పై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంటే ఈ సమయంలో కొత్త కారు కొనుగోలు చేయడం అవసరమా అంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తీవ్రస్థాయిలో అవినాష్ పై ట్రోల్స్ వ్యక్తమవుతున్నాయి.
వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్ల గురించి అవినాష్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
అమ్మకు గుండెపోటు అని చెప్పిన అవినాష్ ఇలా చేయడం ఏంటని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
"""/" /
అవినాష్ పాత కారుకు యాక్సిడెంట్ కావడంతో ఆ కారు స్థానంలో అవినాష్ కొత్త కారు( New Car )ను కొనుగోలు చేయడం జరిగింది.
మహీంద్రా ఎక్స్ యూవీ700 కారును అవినాష్ కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది.విమర్శలకు తావివ్వకుండా అవినాష్ వ్యవహరిస్తే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అవినాష్ జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.అవినాష్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.
డబ్బును ఖర్చు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా అవినాష్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.
అవినాష్ వివరణ ఇవ్వని పక్షంలో అభిమానుల దృష్టిలో ఆయన నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టమాటో తో హెయిర్ ఫాల్ కు చెప్పేయండి టాటా..!