చదివిన పాఠశాలకు రూ.11 లక్షలు ఇచ్చిన ప్రముఖ నటుడు.. ఇతని మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

సెలబ్రిటీల పారితోషికాలు సాధారణ వ్యక్తుల సంపాదనతో పోల్చి చూస్తే ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తంగా ఉంటాయనే సంగతి తెలిసిందే.

తమిళ హాస్య నటుడు అప్పుకుట్టి( Comedian Appu Kutty ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అప్పుకుట్టి తాను చదివిన స్కూల్ కు ఏకంగా 11 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు.

తమిళనాడు రాష్ట్రంలోని( Tamil Nadu ) తూత్తుకుడి జిల్లా నాథన్ కినరు అప్పుకుట్టి స్వస్థలం.

ఆ ప్రాంతంలో ముత్తారమ్మన్ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసి అప్పుకుట్టి ఆ ఉత్సవాలకు హాజరు కావడం జరిగింది.

అప్పుకుట్టి బాల్యంలో గ్రామంలోని తాను చదువుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి గ్రామ ప్రజల కోరిక మేరకు ఆ ఆలయానికి 11 లక్షల రూపాయలు ఇచ్చారు.

ఆ డబ్బులతో టేబుల్, కంప్యూటర్, టీవీ, ఫ్యాన్, ఇతర వస్తువులను ఇచ్చారని సమాచారం అందుతోంది.

"""/" / పాఠశాలకు( School ) అవసరమైన విలువైన సామాగ్రిని సైతం అప్పుకుట్టి అందించారని భోగట్టా.

ఈ స్కూల్ లో తాను ఒకటి, రెండో తరగతి చదువుకున్నానని ఆయన తెలిపారు.

సరైన వసతులు లేకపోవడం వల్ల ఈ స్కూల్ లో చదువుకునే విద్యార్థుల సంఖ్య సైతం తక్కువగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

మనం ఊరి బయట ఉన్నా ఏడాదికి కొన్నిరోజులు ఊరిలోనే ఉండాలని అప్పుకుట్టి పేర్కొన్నారు.

"""/" / అప్పుకుట్టి వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అప్పుకుట్టి మంచి మనస్సును నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

అప్పుకుట్టి ఇలా ఎన్నో సహాయలు చేసి వార్తల్లో నిలవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.అప్పుకుట్టిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

అప్పుకుట్టి లాంటి సెలబ్రిటీలు సహాయం చేయడం వల్ల చాలామందిలో కూడా సేవాభావంతో పాటు సహాయం చేయాలనే కోరిక పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అప్పుకుట్టి తన పారితోషికం పరిమితమైనా ఆ మొత్తం సహాయం చేసి మంచి మనస్సును చాటుకున్నారు.