రోడ్ పైన లుంగీలు అమ్ముకునే అలీని నటుడిని చేసిన ఆ వ్యక్తి ఎవరు..?

సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు కమెడియన్స్ చాలామంది ఉన్నారు.ఒకప్పుడు రాజబాబు, రేలంగి, పద్మనాభం లాంటి చాలా మంది కమెడియన్స్ ఉండేవారు.

తర్వాత తర్వాత రోజుల్లో అల్లు రామలింగయ్య లాంటి వారు చాలా మంది ఉన్నారు.

వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళలో బ్రహ్మానందం అగ్రశ్రేణిలో ఉన్నాడు.బ్రహ్మానందం తో పాటు ఆలీ కూడా తెలుగు చలన చిత్ర సీమలో కామెడీ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు.

ఒక కమెడియన్ వేషం ఉంది అంటే అది ఆలీనే చేయాలి అనేంతగా తన మ్యాజిక్ తెలుగు తెరపై చూపించిన మేటి నటుడు ఆలీ.

అస్సలు అలీ సినిమాల్లోకి ఎలా వచ్చారు అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

అలీ పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో.రాజమండ్రిలో మోహన్ మిత్ర అని ఒక ఆర్కెస్ట్రా నడిపే పెద్దాయన ఉండేవాడు.

ఆయన ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పక్కన లుంగీలు, లంగాలు, గౌన్స్ అమ్ముతున్న ఒక పిల్లాడు కనిపించాడు.

ఈయన ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లి ఇవి ఎలా అమ్ముతున్నావ్ అంటే వెటకారంగా సమాధానం చెప్పడంతో ఆయన కొంచెం కోపానికి వచ్చారు.

దాంతో అలీ వాళ్ళ నాన్న చూసి గురువుగారు మీరా అంటూ పరిగెత్తుకంటూ వెళ్లి మా వాడు ఏం చేసాడు గురువుగారు అని అడిగాడు, ఏం లేదులే అని నవ్వుతూ సమాధానం చెప్పాడు.

దీంతో గురువుగారు వీడితో ఈ పని చేయిస్తున్నావ్ ఏంటి అని అడిగితే చదువు రావట్లేదు గురువుగారు అందుకే ఈ పని చేయిస్తున్నాను అని చెప్పాడు.

అయితే మోహన్ మిత్ర గారు ఆలీ నీ తనతో పాటు తీసుకెళ్లి నీకు ఏమి వచ్చు అని అడిగితే షోలే సినిమాలో డైలాగ్స్ చెప్పాడు, అలాగే మోహన్ మిత్ర షోలే సినిమాలో సాంగ్స్ పాడితే వాటికి సినిమాలో ఉండే సేమ్ స్టెప్పులు వేశాడు.

అలాగే ఎన్టీఆర్,నాగేశ్వరరావు లాంటి పెద్దవాళ్ళ మిమిక్రీ కూడా చేశాడు.దానికి బాగా మెచ్చుకున్న మోహన్ మిత్ర గారు తనతో పాటు ఆర్కెస్ట్రా షోలు చేయడానికి వస్తావా అని ఆలీ నీ అడిగాడు ఆలీ వస్తాను అని చెప్పడంతో మోహన్ మిత్రా గారు అప్పటినుంచి చేసే ప్రతి ఆర్కెస్ట్రా షోకి ఆలిని తీసుకెళ్లాడు.

"""/"/ అలీ అక్కడ డాన్స్ మిమిక్రీ లు చేసేవాడు అయితే ఒకరోజు మోహన్ మిత్రా గారిని కలిసిన విశ్వనాథ్ గారు తనకు ఒక పిల్లవాడు కావాలి అని అడగడంతో మోహన్ మిత్ర గారు అలీ ని పరిచయం చేశాడు.

అప్పుడు డాన్సులు మిమిక్రీ లతో విశ్వనాధ్ గారిని ఇంప్రెస్ చేశాడు.దాంతో ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు.

తర్వాత భారతీ రాజా గారు తీసిన సీతాకోకచిలుకలు ఒక మంచి క్యారెక్టర్ చేశాడు.

ఆ తర్వాత సినిమాలు చేస్తూ కూడా తన గురువుతో తో పాటు ఆర్కెస్ట్రా షోలు చేసేవాడు.

ఆ తరువాత యమలీల సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు హీరో అయిపోయాడు.

అయితే గురువుగారి ఆర్కెస్ట్రా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో విశ్వనాథ్ గారు జంధ్యాల గారు కోట శ్రీనివాసరావు లాంటి పెద్దపెద్ద వాళ్లతో పాటు ఆలీ కూడా అతిధిగా వచ్చాడు.

అప్పుడు కూడా స్టేజ్ పైన గురువు గారు పాట పాడుతుంటే అలీ డ్యాన్స్ చేసాడు.

హీరో అయి కూడా అలా స్టేజ్ పైన డ్యాన్స్ చేశాడు అంటే అలీ కి వాళ్ల గురువు అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.

ఈమధ్య అలీ ఇండస్ట్రీకి వచ్చి నలభై సంవత్సరాలు అయిన కారణంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన సీఎం అలీని సన్మానిస్తూ ఉంటే నాకొద్దు మా అమ్మకి, మా గురువుగారికి సన్మానం చేయండి అని చెప్పడం ఆయన కృతజ్ఞతా భావానికి గుర్తుగా మనం భావించవచ్చు.

"""/"/ ఆలీ సినిమాల్లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా చాలా సినిమాల్లో నటిస్తున్నారు.

ఈ టీవీలో వచ్చే ఆలీతో సరదాగా షో కి యాంకర్ గా చేస్తూ చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ ని, డైరెక్టర్లను ఇంటర్వ్యూ చేస్తున్నాడు.

అలీ ఇండస్ట్రీలో చాలామందికి మంచి ఫ్రెండ్ గా ఉంటాడు ఎవరితో ఈ విభేదాలు పెట్టుకోడు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు వార్తల్లో నిలవడానికి ఇష్టపడడు.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి ఆలీ అంటే చాలా ఇష్టం అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు.

అందుకే ఆయన కోసమే తన సినిమాల్లో ఓ మంచి క్యారెక్టర్ డిజైన్ చేస్తానని చెప్పారు.

ఇడియట్ సినిమా లో చేసిన దొంగ పాత్ర గాని,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లో హీరో ఫ్రెండ్ గా చేసిన క్యారెక్టర్ గాని పోకిరి లో బిచ్చగాడు గా చేసిన క్యారెక్టర్ గాని, దేశముదురు లో సన్యాసిగా చేసిన క్యారెక్టర్ గాని ఇవన్నీ ఆలీ లోని నటనని బయటికి తీసిన క్యారెక్టర్స్.

ప్రశాంత్ వర్మ తన కథలను వేరేవాళ్ళకి ఇవ్వకుండా ఉంటే మంచిదా..?