జనసేన రాజమండ్రి టికెట్ ఈ కమెడియన్ కే ఫిక్స్ అయ్యిందా ..?

జనసేన పార్టీలో మెల్లిమెల్లిగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల టికెట్లు ఫిక్స్ అయిపోతున్నాయి.

ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మిడి వరం నియోజకవర్గానికి పితాని బాలకృష్ణను పవన్ తన తొలి అభ్యర్థిగా ప్రకటించారు.

అంతే తప్ప మరెవ్వరినీ ప్రకటించలేదు.జనసేనాని అధికారికంగా ప్రకటించే రెండో అభ్యర్థి సినీనటుడు ఆలీనేనని పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఆలీ కూడా పవన్ కు వీరాభిమాని.పోటీకి ఆయన ఎప్పుడో ఒకే చెప్పారని తెలుస్తోంది.

గోదావరి జిల్లాల్లో బలంగా వున్న జనసేన తరపున రాజమండ్రికి సీరియస్ గా ఎవరు అసెంబ్లీ సీటుకు పోటీ పడకపోవడమే అన్న టాక్ వస్తుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ రాజముండ్రి లో బలమైన అభ్యర్థి లభించకపోతే ఆలీ ని చివరిలో తెరమీదకు తెస్తారని అంటున్నారు.

గతంలో ప్రజారాజ్యం సమయంలోనే ఆలీ రాజమండ్రి నుంచి పోటీకి ఆసక్తి చూపించారు.అయితే స్థానికంగా వున్న సినీ డిస్ట్రిబ్యూటర్ చల్లా శంకర రావు కు అల్లు అరవింద్ తో వున్న సంబంధాల నేపథ్యంలో ఆలీకి అప్పుడు అవకాశం దక్కలేదు.

ఇక ఇక్కడ ఆలీ వైపు మొగ్గు చూపడానికి కారణం కూడా ఉంది.ఈయన రాజమండ్రి నుంచి వెళ్ళి టాలీవుడ్ లో స్థిరపడినా స్థానికంగా మంచి సంబంధాలే నడుపుతూ వస్తున్నారు.

రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా వున్న దర్గా ఉత్సవాలను ఆలీ నిర్వహిస్తూ ఉంటారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అంతే కాదు రాజమండ్రి నుంచి వెళ్ళి ఎవరు ఆహ్వానించినా వస్తుంటారు కూడా.

ఆలీకి చిన్ననాటి మిత్రులతో పాటు పలువురు వ్యాపారవేత్తలతో కూడా స్థానికంగా మంచి సంబంధాలే వున్నాయి.

అందుకే ఆయనకు జనసేన టికెట్జ ఇస్తే గెలుపు గుర్రం అవుతారని పవన్ భావిస్తున్నాడు.

అంతే కాకుండా మైనార్టీ కోటాలో చూసుకున్నా ఆలీకి టికెట్ ఇవ్వడం పార్టీకి కలిసొస్తుందని పవన్ ఆలోచన.

చిరంజీవిని అనిల్ అలా చూపించనున్నారా.. ఆ సినిమాను మించిన హిట్ గ్యారంటీ!