ఇప్పటికి ఆ లోటు అలాగే ఉండిపోయింది: కమెడియన్ అలీ
TeluguStop.com
యమలీల.కమెడియన్ గా కొనసాగుతున్న అలీని హీరోగా పెట్టి పెద్ద ప్రయోగం చేశాడు ఫ్యామిలీ సినిమాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.
1994లో విడుదలై తెలుగు సినిమా పరిశ్రమలో సంచనల విజయం సాధించింది.ఆ ఏడాది చిన్న సినిమాగా విడుదల అయిన ఈ సినిమా.
అత్యధిక కలెక్షన్ సాధించింది.మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు జనాల నుంచి అనుకోని రీతిలో ఆదరణ దక్కింది.
తొలుత అలీ హీరోగా ఈ సినిమాను ఎస్వీ కృష్ణారెడ్డి ప్రకటించినప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడారు.
అలీ లాంటి కమెడియన్ ను పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారు? అనే మాటలు వినిపించాయి.
యమలీల విజయంతో వారి నోళ్లన్నీ ఆటోమేటిక్ గా మూత పడేలా చేశాడు దర్శకుడు.
ఈ సినిమా సంచలన విజయం సాధించినా.ఆ ఏడాది ప్రకటించిన నంది అవార్డుల్లో అంతగా ప్రాధాన్యత దక్కలేదు.
ఏదో ఇవ్వలేదు అన్నట్లుగా ఒకే ఒక్క అవార్డును అందించారు.అది కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ గా సుచిత్రకు ఈ అవార్డు వచ్చింది.
అన్ని విభాగాల్లో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమాకు ముష్టి వేసినట్లు ఒక్క అవార్డు ఇవ్వడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి.
అలీ ఇప్పటికీ ఈ విషయంలో కోపంగానే కనిపిస్తాడు.నిజానికి ఈ సినిమాకు అన్ని విభాగాల్లో అవార్డులు అందుకునే సత్తా ఉంది.
బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ స్ర్కీన్ ప్లే, బెస్ట్ డైరెక్షన్.ఒకటేమిటీ అన్నింటిలోనూ చక్కటి మంచి ప్రతిభ ఉన్నా.
ఎందుకో అవార్డుల కమిటీ మాత్రం వీటిని లెక్కలోకి తీసుకోలేదు. """/"/
అటు ఇంద్రజ కూడా ఈ సినిమాకు అవార్డులు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ అవార్డు తప్పకుండా రావాలన్నారు.ఈ సినిమాలోని నీ జీనూ ప్యాంటు చూసి బుల్లెమ్మో, సిరులొలికించే చిన్నినవ్వులే, జుంబారే జూజుంబరే అనే పాటలు అప్పట్లో ఎంతో ఫేమస్ అయ్యాయి.
అయినా ఈ పాటలకు తగిన గుర్తింపు రాకపోవడం ఆశ్చర్యకరం.జనాల నుంచి ఎంతో ఆదరణ వచ్చింది.
అవార్డులు వస్తే ఎంత? రాకుంటే ఎంత? అన్నాడు ఓ సారి దర్శకుడు కృష్ణారెడ్డి.
పిల్లలు జాగ్రత్త.. బిస్కెట్ లో ఇనుప తీగ.. (వీడియో)