కొలంబియా యూనివర్సిటీకి షాక్.. ఫార్ట్ స్ప్రే కేసులో విద్యార్థికి రూ.3 కోట్లు పరిహారం..
TeluguStop.com
చాలా రోజుల క్రితం ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇచ్చిందని కొలంబియా యూనివర్సిటీ( Columbia University ) స్టూడెంట్స్ ఒక ప్రొటెస్టు చేశారు.
యూనివర్సిటీ ఈ నిరసనలో ఒక యూదు విద్యార్థిని ఇప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేసింది.
పొరపాటు చేసినందుకుగాను కోర్టు ఆమెకు రూ.3 కోట్లకు సమానమైన నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఆ డబ్బులు ఇవ్వడానికి యూనివర్సిటీ సైతం అంగీకరించింది.నిరసనలో సుమారు 100 విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.
ఆ సందర్భంగా ఒక విచిత్ర ఘటన జరిగింది.మొదట దీన్ని 'రసాయన దాడి' అని అనుకున్నారు.
కానీ తరువాత, అది అమెజాన్‌లో లభించే 'ఫార్ట్ స్ప్రే'( Fart Spray ) అని తేలింది.
"""/" /
ఈ స్ప్రే వల్ల చాలా మంది విద్యార్థులు వికారం, కడుపు నొప్పి, తలనొప్పి, కళ్ళు మండటం వంటి లక్షణాలతో బాధపడ్డారు.
దీంతో కొలంబియా యూనివర్సిటీ, NYPD ఈ ఘటనను హేట్ క్రైమ్‌గా( Hate Crime ) పరిగణించి దర్యాప్తు చేశాయి.
అయితే, తరువాత అధికారులు ఆ స్ప్రే ఎలాంటి ప్రమాదాన్ని కలిగించదని నిర్ధారించారు. """/" /
అమెరికా హౌస్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్‌ఫోర్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, కొలంబియా యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఒక సంఘటనలో యూదు విద్యార్థులను అన్యాయంగా నిందిస్తూ నెలల తరబడి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసింది.
ఈ సంఘటనలో ఇద్దరు విద్యార్థులను 18 నెలల పాటు సస్పెండ్ చేశారు.కానీ, వారిలో ఒకరు ఏప్రిల్‌లో కోర్టును ఆశ్రయించారు, అప్పుడు యూనివర్సిటీ తమ శిక్షను తగ్గించుకుని నష్టపరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
అయితే, ఈ సంఘటన వల్ల విద్యార్థులు ఎంత బాధపడ్డారో యూనివర్సిటీ పట్టించుకోలేదని మరో విద్యార్థి ఆరోపించింది.
ఒక తీవ్రమైన సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని చెప్పింది.
ఈ రెస్టారెంట్ మెనూ ప్రపంచంలోనే ఖరీదైనది.. ధర చూస్తే ఫ్యూజులు ఔట్.. ఎక్కడుందంటే..?