స్వాతి ఎప్పటికీ నా క్రష్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

కలర్స్ అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమై అనంతరం సినిమా అవకాశాలను అందుకొని సినిమాల ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న నటి కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.అయితే వివాహం చేసుకున్న తర్వాత కలర్స్ స్వాతి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇక చాలా కాలం తర్వాత కలర్స్ స్వాతి పంచతంత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమాలో ఎక్కువగా తెలుగు నటీనటులు నటించడం విశేషం.ఇక ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నటువంటి డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ కలర్స్ స్వాతి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.తనకు కలర్స్ కార్యక్రమం చూసినప్పటి నుంచి కలర్ స్వాతి అంటేనే క్రష్ అని తెలిపారు.

ఈమె ఆల్ టైం తన క్రష్ అంటూ హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"""/"/ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ తాను కూడా తన సినిమాలలో ఎక్కువగా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటాను అయితే వారికి న్యాయం చేయలేకపోతున్నానని ఈయన వెల్లడించారు.

ఇక ఈ సినిమాకి పంచతంత్రం అనే టైటిల్ పెట్టినప్పుడే డైరెక్టర్ సగం సక్సెస్ అయ్యారు.

అప్పటినుంచి చిన్న సినిమా అని చాలామంది మాట్లాడుతున్నారు అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఇది చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అనేది మీకు తెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Monkey In Dream : మీ కలలో కోతి కనిపించిందా.. అయితే దీనికి సిద్ధంగా ఉండండి..!