బక్కచిక్కిన స్వాతి అయోమయంలో అభిమానులు...
TeluguStop.com
డేంజర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులతో అష్టా చమ్మా ఆడించినటువంటి ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు 2018వ సంవత్సరంలో వికాస్ అనే పైలెట్ ని పెళ్లి చేసుకొని జకర్త నగరంలో ఉంటోంది.
అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
అంతేగాక తన వివాహం అయినప్పటి నుంచి కలర్స్ స్వాతి ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు.
అయితే తాజాగా ఆమె దిగినటువంటి కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో షేర్ చేసుకుంది.
ఈ ఫోటోలను చూసిన అటువంటి స్వాతి అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
అయితే ఎప్పుడు తెలుగుదనం ఉట్టిపడేలా నిండుగా ఉండే స్వాతి ఒక్కసారిగా బక్కచిక్కి పోవడంతో స్వాతి అభిమానులు కొంతమేర కంగారుపడుతున్నారు.
మరికొందరైతే ఏకంగా స్వాతికి ఏమైంది అంటూ కామెంట్ చేస్తున్నారు.దీనికి కారణాలు లేకపో లేదు.
ఒకసారి తాజాగా కలర్స్ స్వాతి ఇంస్టాగ్రామ్ లో తన షేర్ చేసినటువంటి ఫోటోలను చూస్తే మీకే ఈ విషయం అర్థమవుతుంది.
"""/"/అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కలర్స్ స్వాతి గతంలో నటించిన టువంటి కార్తికేయ ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్నటువంటి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ పనులు ప్రారంభమవుతున్నట్లు సమాచారం.
నాగచైతన్య తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ మ్యాజిక్ రిపీట్ కావడం పక్కా!