తెలుపు రంగు గురించి మీకు తెలియని వాస్తవాలివే..

మనం రంగుల గురించి ఆలోచించినప్పుడు శక్తివంతమైన నీలి ఆకాశం, ప్రకాశవంతమైన ఆకుపచ్చ, పసుపు, ఇతర రంగులు గుర్తుకువస్తాయి.

తెలుపు రంగు వాటిలో ఉన్నా దానిని ప్రత్యేకంగా గుర్తించం.పలు పాశ్చాత్య సంస్కృతులలో తెలుపు రంగు శుభ్రత, స్వచ్ఛత, కన్యత్వానికి సూచికగా చెబుతారు.

అందుకే పాశ్యాతర్య దేశాల్లో పెళ్లి బట్టలు తెలుపు రంగులో ఉంటాయి.ఇప్పుడు తెలుపు రంగుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

పోప్ 1566 నుండి తెలుపు రంగు దుస్తులను ధరిస్తున్నారు.వీరు ధరించిన దుస్తులు త్యాగం, స్వచ్ఛతను సూచిస్తుంది.

భారతదేశంలో వితంతువులు సాంప్రదాయం పేరుతో తెలుపు చీర కట్టుకుంటారు.తెలుపు రంగు నిజానికి అనేక తూర్పు సంస్కృతులలో సంతాపానికి సంకేతంగానూ పరిగణిస్తారు.

ఇది అదృష్టానికి సంకేతమని, మరణానంతర జీవితానికి మార్గం అని చెబుతారు.భౌతిక పరిసరాలలో తెలుపు రంగు అత్యధికంగా కనిపిస్తుంది.

అయినా ఇది చాలమందికి ఇష్టమైన రంగుగా మారలేదు.ఇతర రంగులు షేడ్స్ కలిగి ఉన్న విధంగా నిజమైన తెలుపులో షేడ్స్ లేవు.

దీనికి బదులుగా ఐవరీ, క్రీమ్, లేత గోధుమరంగు, ప్యూటర్ వంటి ఆఫ్-వైట్ షేడ్స్ కలిగి ఉంది.

నిజమైన తెల్లని కాంతి ఉండదు.తెలుపు రంగును చూసినప్పుడు ఇది వివిధ నిష్పత్తులలో అనేక విభిన్న రంగుల మిశ్రమంగా కనిపిస్తుంది.

ముస్లిం యాత్రికులు మక్కాకు వెళ్లే సమయంలో తెల్లటి దుస్తులు ధరిస్తారు.జపనీస్ మతం షింటోలో తెల్లని రాళ్లు ఉన్న ప్రదేశం పవిత్రమైనది, ఎందుకంటే ఆత్మలు అక్కడ నివసిస్తాయని వారు భావిస్తారు.

వైట్ నాయిస్ అంటూ అన్ని సౌండ్ ఫ్రీక్వెన్సీల కలయిక.1949 జెనీవా కన్వెన్షన్‌లో లొంగిపోవడానికి చిహ్నంగా తెల్ల జెండా అధికారికంగా ఆమోదించారు.