భర్తను అన్ ఫాలో చేసిన కలర్స్ స్వాతి…. మరోసారి తెరపైకి విడాకుల వార్తలు?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విడాకులు ( Divorce ) విడిపోతున్నారు.
తాజాగా మరో జంట కూడా విడాకులు తీసుకొని విడిపోయారని తెలుస్తుంది.తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా కొనసాగడం చాలా అరదు.
కానీ తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి కలర్స్ స్వాతి ( Colours Swathi ) ఒకరు.
బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె కలర్స్ అనే షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా ఫేమస్ అయిన కలర్స్ స్వాతికి అనంతరం సినిమా అవకాశాలు వచ్చాయి.
ఈమెకు నాని హీరోగా నటించిన అష్టా చమ్మా సినిమాలో మొదటిసారి హీరోయిన్గా అవకాశం వచ్చింది.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తెలుగులో టైర్ 2 హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు మలయాళం తమిళ సినిమాలలో కూడా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా హీరోయిన్గా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఈమె 2018లో వికాస్ ( Vikas ) అనే వ్యక్తిని వివాహం చేసుకొని విదేశాలకు వెళ్లిపోయారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/01/Color-Swathi-and-vikas-vasu-orce-rumours-goes-viral-in-social-mediaa!--jpg" /
ఇలా విదేశాలలో స్థిరపడడంతో ఇండస్ట్రీకి కాస్త విరామం ఇచ్చిన కలర్స్ స్వాతి తిరిగి ఇండియా చేరుకొని ఇండస్ట్రీపై ఫోకస్ చేశారు.
ఇలాంటి తరుణంలోనే ఈమె విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి.సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో ఈమె విడాకులు తీసుకోబోతున్నారా అనే సందేహం కలిగింది.
ఈ వార్తలపై కలర్స్ స్వాతి గతంలో స్పందిస్తూ తాము పెళ్లి ఫోటోలను డిలీట్ చేస్తేనే విడాకులు తీసుకున్నట్ట మేము ఆ ఫోటోలను ఎంతో భద్రపరచుకున్నాము అని చెప్పుకు వచ్చారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/01/Color-Swathi-and-vikas-vasu-orce-rumours-goes-viral-in-social-mediab!--jpg" /
ఇక తాజాగా తన భర్తను కూడా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో మరోసారి ఈమె విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి.
ఇలా భర్తను అన్ ఫాలో చేసి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఈమె కూడా విడాకులు తీసుకున్నారని అయితే ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈమె విడాకుల వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే స్వాతి స్పందించాల్సి ఉంటుంది.
రొమేనియాలో షాకింగ్ ఘటన.. మహిళా యజమానిని పీక్కుతిన్న పెంపుడు కుక్కలు..