కల్నల్ సంతోష్ బాబు సేవలు మరువలేనివి

సూర్యాపేట జిల్లా:దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన బిక్కుమళ్ల కల్నల్ సంతోష్ బాబు చేసిన సేవలు మరువలేనివని విశ్రాంత ఉపాధ్యాయులు,సంతోష్ బాబు మామ తల్లాడ వెంకటేశ్వర్లు తెలిపారు.

సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద గల సంతోష్ బాబు 39వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతోష్ బాబు వీరమరణం పొంది రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా చైనా సరిహద్దు గాల్విన్ లోయలో ఇంకా అలజడులు జరుగుతూనే ఉన్నాయని విచారణ వ్యక్తం చేశారు.

దేశం కోసం తెగించి ప్రాణత్యాగం చేసి ఎందరో సైనికులను రక్షించారని తెలిపారు.ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు.

ఈ కార్యక్రమంలో తల్లాడ ఉమ తదితరులు పాల్గొన్నారు.

ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సాధించినందుకు సాయిపల్లవికి సన్మానం.. ఈ హీరోయిన్ గ్రేట్ అంటూ?