కొత్తగా వచ్చిన లిప్ లాక్ ఛాలెంజ్.. రోడ్డుపైనే ముద్దులు పెట్టుకుంటున్న విద్యార్థులు!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మనం మనం ఎన్నెన్నో ఛాలెంజ్ లను చూశాం.

ఇందులో కొన్ని ఛాలెంజ్ లు సమాజానికి ఉపయోగపడేవి అయితే మరికొన్ని నవ్వించేవి.కానీ మనం ఇప్పుడు చూడబోయే ఛాలెంజ్ మాత్రం అందరూ ఇబ్బంది పడేది.

అదేంటీ అనుకుంటున్నారా.లిప్ లాక్ ఛాలెంజ్.

ఈ ఛాలెంజ్ పేరిట ఓ ప్రముఖ కళాశాల విద్యార్థులు నడిరోడ్డుపైనే రభసా చేశారు.

ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది.అయితే యువతీ యువకులంతా పోటీ పడి మరీ ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.మంగళూరులోని ఓ ప్రముఖ కళాశాలకు చెందిన విద్యార్థులు.

లిప్ లాక్ ఛాలెంజ్ విసురుకున్నారు.యూనిఫాం ధరించిన వీరంతా నగరంలోని ఓ రహదారిపై గుమిగూడారు.

ఓ ఇంటి ముందు చేరి నానా రభస చేశారు.అమ్మాయిలు, అబ్బాయిలు పోటీపడి మరి ముద్దులు పెట్టుకోగా.

మిగిలిన విద్యార్థులు చుట్టూ చేరి కేరింతలు కొట్టారు.దమ్ముంటే మీరు కూడా ఇలా చేయండి అంటూ తోటి విద్యార్ఖులకు సవాల్ విసిరారు.

లిప్ లాక్ ఛాలెంజ్ పేరిట చేసిన ఈ రచ్చతో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

అక్కడున్న ఓ ఇంట్లోని వ్యక్తి దీన్ని వీడియో తీశాడు.అనంతరం సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు.

ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది.దక్షిణ కన్నడ జిల్లా వ్యాప్తంగా ఈ వీడియో దుమారాన్ని రేపింది.

విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి.వీడియోలో ముద్దు పెట్టుకుంటూ కనిపించిన ఓ విద్యార్థిని అరెస్టు చేశారు.

అమెరికా ఉపాధ్యక్షుడిగా వివేక్ రామస్వామి.. డొనాల్డ్ ట్రంప్ షార్ట్ లిస్ట్‌లో చేర్చారా, ఆన్‌లైన్‌లో చర్చ