అభివృద్ధి పనుల పరిశీలనకై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను అదేశించారు.

శుక్రవారం మోతె మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, వైద్యశాల,2 బి.హెచ్.

కెలు, అంగన్వాడీ కేంద్రాలు,పల్లె ప్రకృతివనాలు,నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు,సలహాలు చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలను ప్రజలకు అందేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

తహసిల్ కార్యాలయం తనిఖీలో భాగంగా ధరణి,ల్యాండ్ బ్యాంకింగ్,పెండింగ్ స్లాట్స్ తదితర అంశాలపై తెలుసుకొని పలు సూచనలు చేశారు.

వేసవి దృష్ట్యా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతి జిపి పరిధిలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాలలో జ్వరాలు, ఇతర సమస్యలు ఉత్పన్నమైతే వైద్యాధికారులు అందుబాటులో ఉండి సత్వర చర్యలు చేపట్టాలని అలసత్యం చూపే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని ఆదేశించారు.

తనిఖీలలో భాగంగా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ సూర్యాపేటలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం, జెడ్.

పి.హెచ్.

ఎస్, కె.జి.

బి.వి,తహసిల్ కార్యాలయంలో పలు పనులను తనిఖీ చేయగా, అదనపు కలెక్టర్ ఎస్.

మోహన్ రావు హుజూర్ నగర్ లో వైద్యశాల, మున్సిపల్ కార్యాలయం, రేషన్ షాప్,పాఠశాలలను తనిఖీ చేశారని తెలిపారు.

జిల్లాలో అన్ని వైద్యశాలలో మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు.మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాలలో పలు అభివృద్ధి పనులను, కార్యాలయాలను, నర్సరీలను పరిశీలించడం జరిగిందని తెలుపుతూ పనుల పరిశీలనకై ఆకస్మిక తనిఖీలు ఉంటాయని ఈ సందర్బంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి.యాదగిరి, ఎంపీడీఓ వెంకటాచారి, ఎంపీఓ హరిసింగ్, జి.

పి.సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

ఆకాశంలో ఏలియన్స్.. గుర్తించిన కెనడియన్ కపుల్..??