ధాన్యం కంట్రోల్ రూమ్ తనిఖీ చేసిన కలెక్టర్

సూర్యాపేట జిల్లా:రైతుల ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ టి.

వినయ్ కృష్ణారెడ్డి కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు.కలెక్టరేట్ నందు ధాన్యం కొనుగోలుపై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను అదనపు కలెక్టర్ ఎస్.

మోహన్ రావుతో కలసి తనిఖీ చేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఫోన్ చేసిన వెంటనే స్వీకరించి ఫిర్యాదులను సత్వరమే రిజిస్టర్ లో నమోదు చేసి,సంబంధిత అధికారులకు తెలియపరిచి,సమస్యల పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు.

ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని,ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.

రైతులు ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే నేరుగా కంట్రోల్ రూమ్ నెం.6281492368 కు ఫోన్ చేయాలన్నారు.

అనంతరం కంట్రోల్ రూమ్ లో ఫిర్యాదుల నమోదు రిజిస్టర్ ను పరిశీలించి సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.

అన్ని కొనుగోలు కేంద్రాలలో పర్యవేక్షణ అధికారులను నియమించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ.

ఓ శ్రీదేవి, పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వెన్న‌లా కరిగిపోవాలంటే ఈ డ్రింక్ ను తీసుకోండి!