జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి:కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట జిల్లా:డిసెంబర్ 15,16 తేదీల్లో జిల్లాలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తేలిపారు.

కోదాడ రీజినల్ పరిధిలో 19,సూర్యాపేట రీజినల్ పరిధిలో 30 పరీక్షా కేంద్రాలు మొత్తం 49 ఏర్పాటు చేసినట్లు,జిల్లా వ్యాప్తంగా 16857 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు.

పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్లు, శాఖపరమైన అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

పరీక్ష పత్రాలను పటిష్ట బందోబస్తు, ఎస్కార్ట్ల తో తీసుకెళ్లేందుకు ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులకు సూచించారు.

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.డిసెంబర్ 15వ,తారీకు ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు,మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు,డిసెంబర్ 16వ,తారీకు ఉదయం10 గంటల నుండి 12:30 వరకు,మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు నాలుగు దఫాలుగా పరీక్షలు జరుగుతాయన్నారు.

పరీక్ష కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాలని,మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ వస్తువులతో రాకూడదని, పరీక్షలు జరుగు కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ విధించి,రక్షణ చర్యలు తీసుకుని,ఆ ప్రాంతంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయడం జరుగుతుందన్నారు.

పరీక్షా కేంద్రాలలో విద్యుత్ సదుపాయం సరిచూసుకోవాలని,టాయిలెట్స్,త్రాగునీరు అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత సెంటర్ నిర్వాహకులకు సూచించారు.

పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.విద్యుత్ అంతరాయం రాకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

కేంద్రాల వద్ద సానిటేషన్ నిర్వహించాలని,పరీక్షలు జరిగే సమయాలలో అభ్యర్థుల సౌకర్యార్థం బస్సుల సమయాలను మార్చాలని సూచించారు.

ఎలాంటి అవసరాలకైనా టీజీపిఎస్సీ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ నెంబర్ 040- 67445566,040- 222335566 కంట్రోల్ రూం 040-24746887,040- 24746888 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్14, శనివారం 2024