నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో శుక్రవారం హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి.
జిల్లా అధికార యంత్రాంగం,పోలీస్ అధికారులు,సిబ్బంది రంగులు పూసుకొని కేరింతలు కొట్టారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వారితో కలిసి హోలీ ఆడుతూ డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు.