అర్జీలు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసి దరఖాస్తులు తీసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

ఆర్జీలను ఆయా శాఖల అధికారులకు అందజేసి, సమస్యను పరిష్కరించాలని సూచించారు.ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులు.

రెవెన్యూ శాఖకు 56, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 26, ఎస్పీకి 7, ఎస్ డీ సీ, జిల్లా సంక్షేమ అధికారి కి ఐదు చొప్పున, విద్యా శాఖకు 4, ఉపాధి కల్పన శాఖకు 3, జిల్లా పంచాయతీ అధికారి, హండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, సర్వే, వ్యవసాయ శాఖ, ఎంపీడీఓ ఎల్లారెడ్డి పేటకు రెండు చొప్పున, ఎంపీడీవో కొనరావుపేట, వీర్ణపల్లి, వేములవాడ రూరల్, ముస్తాబాద్, గంభీరావుపేట చందుర్తి, డీఎం డబ్ల్యూఓ, ఎల్ డిఎం, ఈఓ వేములవాడ టెంపుల్, లేబర్ ఆఫీసర్, ఇరిగేషన్, ఎంబీ ఇంట్ర, ఏరియా ఆసుపత్రి, ఎస్సీ కార్పొరేషన్,సెస్, అటవీ శాఖకు ఒకటి చొప్పున వచ్చాయి.

ఈ కార్యక్రమం లో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

పిల్లల కోసం అమెరికన్ తల్లి చేసే ఇండియన్ వంటలు చూస్తే నోరూరిపోతుంది!