విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ( Eklavya Model Residential School )విద్యాలయంలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (
Collector Sandeep Kumar Jha )ఆదేశించారు.
మంగళవారం కోనరావుపేట మండలం( Konaraopet ) మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యాలయ ఆవరణ, తరగతి గదులు, కిచెన్, తదితర వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
బాలుర, బాలికల డార్మీటరి , తరగతి గదుల్లో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
భోజన సదుపాయం, తరగతులు ఎలా బోధిస్తున్నారు అనే వివరాలను ఆరా తీశారు.టాయిలెట్లు తక్కువగా ఉన్నాయని వెంటనే రెండు టాయిలెట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఎంపీడీఓను ఆదేశించారు.
గ్రామం నుండి విద్యాలయం వరకు రోడ్ సరిగా లేదని రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
విద్యార్థులకు ఉపాధ్యాయులు తరగతులు బోధిస్తున్న తీరును పరిశీలించారు.అన్ని సబ్జెక్టులలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా పాఠాలు బోధించాలని ఆదేశించారు.
ఇక్కడ జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తదితరులు ఉన్నారు.తదనంతరం నిమ్మపల్లి గ్రామంలో చేపడుతున్న బ్రిడ్జి మరమ్మత్తు పనులను కలెక్టర్ పరిశీలించారు.
కమల్ హాసన్ విలన్ పాత్రల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాడా..? కారణం ఏంటి..?