అందుబాటులో ఉండి సేవలందించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

గంభీరావుపేట సీహెచ్ సీ తనిఖీ ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలి ముస్తాబాద్, పోత్గల్ పీఏసీఎస్ ల తనిఖీలో జిల్లా కలెక్టర్.

సకాలంలో స్పందించి పాపను దవాఖానకు తరలించిన జిల్లా కలెక్టర్రాజన్న సిరిసిల్ల జిల్లా : వైద్యులు అందుబాటులో ఉండి.

సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.గంభీరావుపేటలోని సీ.

హెచ్.సీని శుక్రవారం ఉదయం ఆకస్మికంగా  తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఓపీ, ఐపీ, లేబర్ రూం, ఫార్మసీ, ల్యాబ్, టాయిలెట్స్, ప్రహరీ, జనరేటర్, డ్రైనేజీ పరిశీలించి, వైద్యులు, అధికారులకు పలు సూచనలు చేశారు.

సీజనల్ వ్యాధుల కేసులు, వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

దవాఖానలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇంకా కావాల్సిన వసతుల పై ఆరాతీశారు.ఆయా పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.ముస్తాబాద్, పోత్గల్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయా పీ.ఏ.

సీ.ఎస్.

లలో ఈ - పాస్ యంత్రాలను, నిల్వ ఉన్న యూరియా స్టాక్ ను పరిశీలించారు.

ఎరువులు ఎంత ధరకు విక్రయిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.రైతులకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా స్టాక్ ఉండాలని ఆదేశించారు.

పీ.ఏ.

సీ.ఎస్.

పరిశీలన అనంతరం కలెక్టర్ తన వాహనంలో వెళ్తుండగా ఒక పాపతో మహిళ వాహనానికి అడ్డుగా వచ్చారు.

దీంతో కలెక్టర్ వాహనం నుంచి వెంటనే దిగి ఆమె వివరాలు అడిగారు.తన పాపకు తీవ్రమైన జ్వరం వచ్చిందని అలాగే ఫిట్స్ కూడా ఉన్నాయని సహాయం అందించాలని వేడుకోగా, స్పందించిన కలెక్టర్ వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి తరలించారు.

అక్కడే కొద్ది సమయం ఉండి వైద్యులతో మాట్లాడారు.పాపకు మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు.

పాప జ్వరం, ఫిట్స్ తో బాధపడుతుందని వైద్యులు తెలిపారు.సకాలంలో కలెక్టర్ మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించడంతో పాపకు ప్రాణా పాయం తప్పింది.

ఈ పర్యటన లో డీ.సీ.

హెచ్.ఎస్.

మురళీధర్ రావు, డాక్టర్లు శ్రీనివాస్, సిందూజ, నర్సులు, సిబ్బంది,జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, పీఏసీఎస్ సిబ్బంది, రైతులుతదితరులు పాల్గొన్నారు.

వీడియో: పాకిస్థాన్‌లో ప్రాంక్ చేసిన యువకులు.. లాస్ట్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్..?