ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : స్వాతంత్ర్య సమర యోధుడు, జాతిపిత మహాత్మగాంధీ జయంతి ( Mahatma Gandhi Jayanti )వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో మహాత్మగాంధీ జయంతి వేడుకలు నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు జాతిపిత చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం సిరిసిల్ల లోని గాంధీ చౌక్ లో ఉన్న మహాత్మగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఇక్కడ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: నడిరోడ్డుపై సింహాన్ని చుట్టేసిన కొండచిలువ