ఈవీఎంలు, వీ వీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఫస్ట్ రాండమైజేషన్లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గటాయించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పరిశీలించారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్ధాపూర్ ఈ వీ ఎం గోడౌన్ నుంచి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూమ్ లకు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.
ఆయా రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. తగిన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలని సూచించారు.
సిరిసిల్ల నియోజకవర్గానికి కంట్రోల్ యూనిట్స్ 358, బ్యాలెట్ యూనిట్స్ 358, వీ వీ ప్యాట్లు 401, వేములవాడ నియోజకవర్గానికి కంట్రోల్ యూనిట్స్ 325, బ్యాలెట్ యూనిట్స్ 325, వీ వీ ప్యాట్లు 364 కేటాయించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్ సిరిసిల్ల, వేములవాడ ఆర్టీవోలు రమేష్, రాజేశ్వర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
జగన్ జిల్లా పర్యటనలు .. క్యాడర్ కు ఆసక్తి లేదా ?