స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన కలెక్టర్ హరిచందన

మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల( Miryalaguda Government Junior College )లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం,రిసెప్షన్ కేంద్రం,ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూంలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ దాసరి హరిచందన( Collector Harichandana ) పరిశీలించారు.

ఈవిఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేయాల్సిన సీసీకెమెరాలు, భద్రత ఏర్పాట్లు తదితర అంశాలపై పలు సూచనలను చేశారు.

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా( Parliament Elections ) ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడే డిఆర్సీ కేంద్రాలను, స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసిన విషయాన్ని తెలుసుకొని గతంలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాస్ రావు, డిఎస్పి రాజశేఖర్ రాజు, తహసిల్దార్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

పురాణాలే కమర్షియల్ ముడి సరుకుగా ప్రస్తుతం వస్తున్న సినిమాలు !