కొలనుపాక ఎస్సీ హాస్టల్ ను కలెక్టర్ అకస్మిక తనిఖీ
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు మండలం కొలనుపాక ఎస్సీ వెల్పేర్ హాస్టల్ వార్డెన్ ఆనంద్ కు యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
శనివారం రాత్రి హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హాస్టల్లో ఉన్న సౌకర్యాలపై వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రికార్డులు సరిగా నిర్వహించటం లేదని,విద్యార్థుల హాజరు గత నాలుగు రోజులుగా తీసుకోకపోవడమే కాకుండా 39 మంది విద్యార్థులు ఉండవలసిన చోట కేవలం 17 మంది విద్యార్థులు మాత్రమే ఉండి,22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని,వంట గదిలో సరియైనటివంటి లైటింగ్ లేకపోవడంతో చీకటిలో వంట చేస్తున వంటమనుషులు వండిన కూర కూడా 17 మంది విద్యార్థులకు సరిపడా లేదని, విద్యార్థులు ఉండే గదులలో సరైన లైటింగ్ కూడా లేదని, కందిపప్పు మరియు చింతపండులో నాణ్యత పాటించటం లేదని,నిర్దేశించిన బ్రాండ్ వాడటం లేదని, బాత్రూమ్ కి వెళ్తే దారిలో లైటింగ్ కూడా సరిగా లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్ ఆనంద్ కి ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దని అడుగుతూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
వీడియో వైరల్: అయ్యబాబోయ్.. పావురానికి ఇలా కూడా ట్రైనింగ్ ఇస్తారా?