మోతె మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు…!

సూర్యాపేట జిల్లా:మోతె మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రి,రెవెన్యూ అధికారులతో అభివృద్ధి పనులపై పరిశీలించారు.తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎంపిడిఓ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల తప్పుఒప్పుల సవరణపై సమీక్షించారు.సీజన్ రావడంతో విషజ్వరాలు ప్రబలుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సంఘమిత్ర,ఎంపిడిఓ హరిసింగ్,డిటి సూరయ్య, సుపెర్నడెంట్ వెంకటాచారి, ఆర్ఐ అజయ్,మల్సూర్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సాయి ధరమ్ తేజ్ సినిమాల ఎంపికలో భారీ మార్పులు వచ్చాయా..?