జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla )లోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) అధికారులను ఆదేశించారు.

బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హల్ లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పెండింగ్ భూ సేకరణ, నిర్మాణ పనుల పురోగతి, ప్యాకేజీ -9 , 12 పెండింగ్ పనుల పై జిల్లా కలెక్టర్ రెవెన్యూ, అటవీ, ఇంజనీరింగ్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ - 2 ఫేజ్ -1 పెండింగ్ భూ సేకరణ, నిర్మాణ పనుల వేగంగా పూర్తి చేయాలన్నారు.

ప్యాకేజీ -9 , 12 పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఈ ప్రాజెక్ట్ ల పూర్తి కి ఇంకా నిధులు కావాల్సి వస్తే సంబంధిత సమగ్ర ప్రతిపాదనలు ప్రభుత్వానికీ నివేదించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అటవీ అనుమతులు సకాలంలో రాక జిల్లాలో కొన్ని చోట్ల రోడ్లు, ఇతర అభివృద్ధి నిర్మాణ పనులు వేగంగా చేయలేకపోతున్న దృష్ట్యా.

రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జిల్లా అటవీ అధికారి బాలమని, ఆర్డీఓ మధు సూదన్ , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి గంగయ్య,ఎస్ వై పి ( శ్రీధప ఎల్లంపల్లి ప్రొజెక్ట్ ) ఈ ఈ సంతు ప్రకాష్ , కలెక్టరేట్ పర్యవేక్షకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ దేశానికి వెన్నెముక.. వైరల్ అవుతున్న మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు!