ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

జిల్లాలోని 547 పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల అధికారులు, సిబ్బంది ఈవీఎంలను సిరిసిల్ల, వేములవాడలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లలో అప్పగించారు.

ఆయా ఈవీఎం లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్, సిరిసిల్ల ఏఆర్ఓ పూజారి గౌతమి, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీవో, ఏఆర్ఓ రాజేశ్వర్ పరిశీలించారు.

పోలింగ్ ప్రశాంతం కలెక్టర్ అనురాగ్ జయంతి పక్కా ప్రణాళికతో ఎన్నికల నిర్వహణకు సిరిసిల్ల, వేములవాడ ఏఆర్ఓలు పూజారి గౌతమి, రాజేశ్వర్ ఎన్నికల ఏర్పాట్లు చేయించారు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి సెక్టార్ ఆఫీసర్స్, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్సలకు ఎన్నికల సందర్భంగా నిర్వర్తించాల్సిన బాధ్యతలపై పలు మార్లు కలెక్టర్ శిక్షణ ఇప్పించారు.

ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ బృందాలు, ఎంసీఎంసీ కేంద్రం ఏర్పాటు చేయించి, ఎప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షించారు.

పోలింగ్ సందర్భంగా ఉదయం నుంచి ఎంసీఎంసీ కేంద్రం, వెబ్ కాస్టింగ్ ను పరిశీలిస్తూ, అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రీ వెడ్డింగ్ షూట్‌లో రెచ్చిపోయిన జంట.. వీడియో వైరల్