గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు శిక్షణలో కలెక్టర్ అనురాగ్ జయంతి

గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు శిక్షణలో కలెక్టర్ అనురాగ్ జయంతి

తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి పారిశుధ్య పనులు నిత్యం చేయించాలి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు శిక్షణలో కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల నియామకమైన ప్రత్యేక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని,సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపు నిచ్చారు.

గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు శిక్షణలో కలెక్టర్ అనురాగ్ జయంతి

సర్పంచ్ ల పదవి కాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీ(జీపీ)లకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులను నియమించింది.

గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు శిక్షణలో కలెక్టర్ అనురాగ్ జయంతి

వారికి సిరిసిల్లలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ఒక రోజు ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్స్ విధులు, బాధ్యతలఫై జడ్పీ సీఈఓ గౌతం రెడ్డి వివరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.ఈ నెల 7వ తేది నుంచి 15 వ తేది దాకా ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలు చేపట్టనున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్రమాల్లో గ్రామంలోని యువత, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.గ్రామాలను అభివృద్ది చేసే మంచి అవకాశం స్పెషల్ ఆఫీసర్లకు వచ్చిందని, సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.ప్రతి గ్రామపంచాయతీలో నిత్యం మూడు పనులు ముఖ్య మైనవని తెలిపారు.

గ్రామాల్లోని నీటి ట్యాంక్లకు నీరు వస్తుందా? లేదా తనిఖీ చేయాలని ఆదేశించారు.అలాగే ట్యాంక్ నుంచి గ్రామంలోని ప్రతి ఇంటికీ నీరు సరఫరా అవుతుందా? లేదా చూసుకోవాలని సూచించారు.

ఎక్కడైనా సమస్య ఉందా అని గుర్తిoచాలని వివరించారు.నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామంలో చెత్త సేకరణ నిత్యం చేయాలని పేర్కొన్నారు.జీపీ ట్రాక్టర్ రోజు ఉదయం వెళ్ళేలా చూడాలన్నారు.

తడి, పొడి చెత్త వేరువేరుగా ఇచ్చేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.వీధి దీపాలు నిత్యం వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

నీటి సమస్య పరిష్కారానికి 15వ ఆర్ధిక సంఘం నిధులు వినియోగించాలని కలెక్టర్ వెల్లడించారు.

గ్రామ్మాల్లో ఆదాయ పన్ను వసూలు చేయించాలని ఆదేశించారు.గత ఏడాది జిల్లాలో 100 శాతం ఇంటిపన్ను వసూలు చేశామని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఈ ఏడాది80 శాతం పూర్తి అయిందని తెలిపారు.స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు 100 ఇంటి వసూలు చేయాలని సూచించారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ మిషన్ భగీరథ ఇంట్రా ఈ ఈ జానకి తదితరులు పాల్గొన్నారు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..