పక్కా ప్రణాళికతో పనులు పూర్తి చేయాలి – అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరమ్మతు పనులపై సమీక్షలో కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఆయా స్కూళ్ళలో మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేయాల్సిన మరమ్మతు పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాలులో జిల్లాలోని ఈఈలు, ఎంపీడీఓలు, ఏఈలతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

స్కూళ్ళలో నీటి సరఫరా, విద్యుత్ పరికరాల ఏర్పాటు, మరుగుదోడ్ల మరమ్మతు, నీటి సదుపాయం, పాఠశాలల ఆవరణలో మరమ్మతు తదితర పనులపై ఆయా మండలాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఎన్ని  స్కూళ్ళలో పనులు మొదలు పెట్టారు? ఎన్ని పూర్తి అయ్యాయో చర్చించారు.

పనులు నాణ్యతతో చేయించాలని, ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులు గడువులోగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇక్కడ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జడ్పీ సీఈవో ఉమారాణి, డీఈఓ రమేష్ కుమార్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అనిత సింగనాథ్, డీపీఓ వీర బుచ్చయ్య, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కెనడాలో రెచ్చిపోయిన దుండగులు.. హిందూ ఆలయంపై చెత్త రాతలు, భారత్ ఆగ్రహం