పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన బ్రిడ్జి..!
TeluguStop.com
పెద్దపల్లి జిల్లా( Pedpadalli District )లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది( Bridge Collapses ).
ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో మానేరు నదిపై ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.
అయితే ఈదురుగాలుల బీభత్సానికి బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిందని సమాచారం.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోయాయి.
నాసిరకం నిర్మాణ పనుల వలనే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలిందని సమీప గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ( Bhupalpally )మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.
"""/" /
కాగా 2016 ఆగస్టులో సుమారు రూ.49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు.
అయితే పనులు ప్రారంభించి తొమ్మిదేళ్లు పూర్తి కావస్తున్నా నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు.
బోరు గుంతలో మనవడు కాపాడబోయి తాత మృతి