కిడ్నీ సమస్యలు ఉన్నవారు కాఫీ తాగితే ఏం అవుతుందో తెలుసా?
TeluguStop.com
కాఫీ.ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఎంతో ఇష్టంగా తాగే పానియాల్లో ఇది ఒకటి.
కొందరికి ఉదయం లేవగానే కాఫీ తాగకుంటే రోజు కూడా గడవదు.అంతలా కాఫీకి ఎడిక్ట్ అవుతుంటారు.
అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని.దానికి దూరంగా ఉండే వారు చాలా మందే ఉన్నారు.
కానీ, కాఫీ ఆరోగ్యానికి మంచిదే అని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి.గుండె జబ్బులను దూరం చేయడంలోనూ, మైండ్‌ను రీ ఫ్రెస్ పరచడంలోనూ, మధుమేహం వచ్చే రిస్క్‌ను తగ్గించడంలో ఇలా ఎన్నో అరోగ్య ప్రయోజనాలను కాఫీ అందిస్తుంది.
అంతేకాదు, కిడ్నీ సమస్యలు ఉన్న వారికి కాఫీ అద్భుతంగా ఉపయోగపడుతుంది.శరీరంలో కిడ్నీలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ, వ్యర్థాలను బయటకు పంపడంలోనూ, మలినాలను తొలిగించడంలోనూ కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే నేటి కాలంలో రకరకాల కారణాల వల్ల కిడ్నీ సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఒక్కసారి కిడ్నీ పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే.
మనిషి ఆరోగ్యంగా మరియు ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. """/" /
అందుకే కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం.
అయితే కిడ్నీ సమస్యలు ఉన్న వారు రోజుకో కప్పు కాఫీ తీసుకుంటే చాలా మంచిదంటున్నారు నిపుణులు.
అవును, కాఫీ తాగని వారితో పోల్చుకుంటే.తాగిన వారిలోనే 25 శాతం ఎక్కువగా కిడ్నీ సమస్యలు తగ్గుతున్నాయట.
అందుకే కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడే వారు.మద్యం, సిగరెట్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ.
ప్రతి రోజు కాఫీని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అయితే కాఫీ మంచిది కదా అని అతిగా మాత్రం తీసుకోకూడదు.
అలా చేస్తే.కిడ్నీ లు ఐరన్, మేగ్నిషియం ఇతరితర మినరల్స్‌ను గ్రహించే శక్తి తగ్గిపోతుంది.
దాంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అలాగే కాఫీని అతిగా తీసుకంటే.
డిహైడ్రేషన్, మలబద్ధకం, అధిక బరువు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకు రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీని మాత్రమే తీసుకోవాలి.
ఆ స్టార్ డైరెక్టర్ కు ఒకేసారి షాకిచ్చిన చిరంజీవి, బాలయ్య.. ఏం జరిగిందంటే?