ఈ కోకోనట్ ఓట్స్ స్మూతీ బెనిఫిట్స్ తెలిస్తే డైట్ లో చేర్చుకోకుండా ఉండలేరు!

ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో స్మూతీలు ఉన్నాయి.అందులో కోకోనట్ ఓట్స్ స్మూతీ కూడా ఒకటి.

ఈ స్మూతీ అందించే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలిస్తే డైట్ లో చేర్చుకోకుండా ఉండలేరు.

ఇంకెందుకు ఆలస్యం కోకోనట్ ఓట్స్ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు అది అందించే ప్రయోజనాలు ఏంటి.

? అన్నది కింద‌కు ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని కనీసం ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

ఈలోపు ఒక కప్పు కొబ్బరి ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండ‌ర్ లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు, నానబెట్టుకున్న ఓట్స్, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె మరియు ఐదు నైట్ అంతా వాటర్ లో నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన కోకోనట్ ఓట్స్ స్మూతీ సిద్ధం అవుతుంది.

"""/" / ఈ స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

వారంలో మూడు లేదా నాలుగు సార్లు ఈ కోకోనట్ ఓట్స్ స్మూతీ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు.

బెల్లీ ఫ్యాట్ కొద్ది రోజుల్లోనే మాయం అవుతుంది.రక్తంలో బాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

దాంతో గుండెపోటు తో సహా ఇతర గుండె సంబంధిత వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

"""/" / అలాగే ఈ కోకోనట్ ఓట్స్ స్మూతీ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల మధుమేహం బారిన పడకుండా ఉంటారు.

రక్తపోటు అదుపులో ఉంటుంది.ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.

రక్తహీనత సమస్య ఉంటే దూరం అవుతుంది.హెయిర్ ఫాల్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

మరియు రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా కూడా ఉంటారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు : పోటీపై నేడు టిడిపి నిర్ణయం.. అభ్యర్థిగా దిలీప్ చక్రవర్తి ?