మొటిమలను నివారించే కొబ్బరి పాలు.. ఎలాగో తెలుసా?
TeluguStop.com
ఇటీవల కాలంలో యువతను మొటిమల సమస్య తీవ్రంగా వేధిస్తోంది.ఈ సమస్య నుంచి బయటపడేందుకు మార్కెట్‌లో దొరికే అనేక రకాల ఫేస్ క్రీములను, లోషన్లను వేలకు వేలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసి.
ఉపయోగిస్తుంటారు.కానీ, సమస్య మాత్రం తగ్గదు.
అయితే మొటిమలను తగ్గించడంలో కొబ్బరి పాలు అద్భుతంగా సహాయపడతాయి.మరి కొబ్బరి పాలను ఎలా ముఖానికి ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొబ్బరి పాలను తీసుకుని.అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి.
"""/" /
కొబ్బరి పాలలో కొద్దిగా బాదం పొడి మరియు తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.పావు గంట తర్వాత గోరువెచ్చటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల కూడా మొటిమల సమస్య తగ్గుతుంది.మరియు మచ్చలు కూడా తొలగి.
ముఖం కాంతివంతంగా మారుతుంది.అలాగే కొబ్బరి పాలలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
అనంతరం గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల మొటిమలు పోవడంతో పాటు చర్మానికి తేమ అంది మృదువుగా మరియు అందంగా మారుతుంది.
ఈ ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో భారీ సక్సెస్ అయిన సినిమాలు ఇవేనా..?