అధిక ఒత్తిడి వేధిస్తుందా..అయితే కొబ్బ‌రి పాలు తాగాల్సిందే?

నేటి ఆధునిక కాలంలో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఏదో ఒక స‌మ‌యంలో, ఏదో ఒక కార‌ణం చేత ఒత్తిడికి గుర‌వుతుంటారు.

బిజీ బిజీ లైఫ్ లో ఒత్తిడితో సత మత‌మ‌వ్వ‌డం స‌ర్వ సాధార‌ణం.అయితే ఈ ఒత్తిడి నుంచి వెంట‌నే బ‌య‌ట ప‌డితే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.

కానీ, కొంద‌రు ఒత్తిడిని మ‌రింత పెంచుకుంటున్నారు.అదే వారి పాలిట శాపంగా మారి.

మాన‌సికంగా మ‌రియు శారీర‌కంగా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేలా చేస్తుంది.అలాగే ఏ ప‌నిపై శ్రద్ధ వ‌హించ‌లేరు.

త‌ర‌చూ నిరాశ‌కు గుర‌వుతుంటారు.ఇక ఒత్తిడి కార‌ణంగా అధిక బ‌రువు, గుండె జ‌బ్బు, మ‌ధుమేహం, అధిక ర‌క్త పోటు ఇలాంటి జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు కూడా చాలా ఎక్కువ‌.

అందుకే ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడూ చెబుతూ ఉంటారు.

అయితే అధిక ఒత్తిడికి చెక్ పెట్ట‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాంటి వాటిలో కొబ్బ‌రి పాలు కూడా ఉన్నాయి.కొబ్బ‌రి నుంచి తీసే కొబ్బ‌రి పాలు రుచిగా ఉండ‌ట‌మే కాదు.

పోష‌కాలు కూడా మెండుగా ఉంటాయి. """/"/ కొబ్బ‌రి పాల‌లో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పసర్, రాగి, విటమిన్ సి, విట‌మిన్ బి, ప్రోటీన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోష‌కాలు కొబ్బ‌రి పాలలో ఉంటాయి.

అందుకే కొబ్బ‌రి పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా అధిక ఒత్తిడితో బాధ ప‌డే వారు.

ప్ర‌తి రోజు ఒక క‌ప్పు కొబ్బ‌రి తీసుకుంటే మంచిది.కొబ్బ‌రి పాల‌లో ఉండే పొటాషియం ఒత్తిడిని దూరం చేసి.

మ‌నసు ప్ర‌శాంతగా మారుతుంది.ఇక కొబ్బ‌రి పాలు తీసుకుంటే బ‌రువు పెరిగిపోతార‌న్న భ‌య‌మే అక్క‌ర్లేదు.

అలాగే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు కూడా ఎలాంటి భ‌యం లేకుండా కొబ్బ‌రి పాలు తీసుకోవ‌చ్చు.

అయితే అతిగా మాత్రం తీసుకోరాదు.ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.

అతిగా తీసుకుంటే అదే విషంగా మారుతుంది.ఇందుకు కొబ్బ‌రి పాలు కూడా మిన‌హాయింపు కాదు.

బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ ఎన్ని లక్షలు సంపాదించారో తెలుసా?