కొబ్బరికాయ కొట్టిన తరువాత అందులో ఈ ఒక్కటి వేసి నైవేద్యం పెడితే...అన్ని శుభాలే
TeluguStop.com
మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు పెద్దగా నియమాలను పాటించం.కానీ కొన్ని నియమాలను పాటించాలని పండితులు అంటున్నారు.
మనం పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేస్తే పూజ అయ్యిపోయిందని భావిస్తాం.
కానీ కొబ్బరికాయ కొట్టటం,నైవేద్యం పెట్టటంలో కూడా ఒక విధానం ఉంది.ఆ విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కొబ్బరి కాయను దేవుడి దగ్గర కొట్టటం వలన అరిష్ఠాలు అన్ని పోయి శాంతి కలుగుతుంది.
కొబ్బరికాయను శుభ్రంగా కడిగి పీచు ఉన్న ప్రదేశంలో పట్టుకొని కొట్టాలి.కొబ్బరికాయ కొట్టే సమయంలో కొట్టటానికి ఉపయోగించే రాయి ఆగ్నేయ దిశలో ఉండాలి.
కొబ్బరికాయను సుమారుగా 8 అంగుళాల ఎత్తు నుండి కొట్టాలి.కొబ్బరికాయ సమంగా పగిలితే శుభం కలుగుతుందని భావిస్తారు.
ఒకవేళ కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల ఏమైనా నల్లగా ఉంటే శివాయ నమహ అంటూ 108 సార్లు జపిస్తే ఆ దోషం పోతుంది.
కొబ్బరికాయను కొట్టిన తర్వాత నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.గిన్నెలోని కొబ్బరినీటిలో మరియు కొట్టిన కొబ్బరి చిప్పలలో పంచదార లేదా పటికబెల్లం పలుకులు వేసి నైవేద్యం పెట్టాలి.
ఈ విధంగా కొట్టిన కొబ్బరి చిప్పలలో పంచదార వేసి నైవేద్యం పెడితే అన్ని శుభాలే జరుగుతాయట.
మీరు కూడా కొబ్బరికాయ కొట్టినప్పుడు మర్చిపోకుండా పంచదార వేసి నైవేద్యం పెట్టండి.
బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసిన అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్…. హింట్ ఇచ్చిన హాట్ స్టార్!