ఆ రెండు కూల్ డ్రింక్స్ పై నిషేధం విధించాలి అన్న పిటీషనర్, ఝలక్ ఇచ్చిన కోర్టు

ఎదో సామెత చెప్పినట్లు కొండ నాలిక కు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లు ఉంది ఈ వ్యవహారం.

ఎదో కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం వాటిని బ్యాన్ చేయాలి అని, తన వంతు గా ఎదో ప్రయత్నిద్దాం అనుకున్న ఒక సామజిక కార్యకర్తకు రివర్స్ లో జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది.

థమ్సప్, కోకాకోలా కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం అని, వాటి అమ్మకాలపై నిషేధం విధించాలంటూ సామాజిక కార్యకర్తనని పేర్కొన్న ఉమెద్సిన్హా చావ్డా అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ను సుప్రీం కోర్టు లో దాఖలు చేశారు.

దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, హేమంత్ గుప్తా, అజయ్ రాస్తోగిలతో కూడిన బెంచ్.

విచార‌ణ జ‌రిపగా, పిటీషనర్ కు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.అయితే, తన పిటిషన్‌లో ప్రత్యేకించి రెండు ప్రముఖ బ్రాండ్స్‌నే ఎందుకు ఎంచుకున్నారనే విషయంపై స్పష్టతనివ్వడంలో పిటీషనర్ విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.

ఆ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం అని నిరూపించలేకపోయారంటూ పిటిషన్ ను కొట్టివేసింది.పిటిషనర్ ఈ విషయంపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా వ్యాజ్యం దాఖలు చేసినట్లు కోర్టు పేర్కొంది.

ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిధిని మించి, చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని ఆగ్రహించిన బెంచ్ రూ.

5 లక్షల జరిమానా కట్టాలని పిటిషనర్ ను ఆదేశించింది.అంతేకాకుండా నెల రోజుల్లోగా ఆ జరిమానా మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసియేషన్ కు పంపించాలని చావ్డాను సుప్రీం కోర్టు ఆదేశించింది.

వీడియో వైరల్: మెట్రోలో ముద్దులతో రెచ్చిపోయిన మరో జంట.. చివరకు..