కోకాకోలా కూల్ డ్రింక్స్ ఇక నుండి ప్లాస్టిక్ బాటిళ్లల్లో రావట.. !
TeluguStop.com
కోకాకోలా కంపెనీ తన కూల్‌డ్రింక్స్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుందట.ఇప్పటి వరకు కూల్ డ్రింక్స్ ను బాటిళ్లల్లో అందిస్తున్న ఈ కంపెనీ ఇకనుండి ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించమని వెల్లడిస్తుంది.
ఇకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలపై ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో ప్లాస్టిక్ వ్యర్థాలకు ఎక్కువగా కారణమవుతున్న సంస్థల్లో కోకాకోలా కంపెనీ మొదటి స్థానం దక్కించుకుందట.
అందుకే కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో పేపర్ బాటిల్స్‌ను తీసుకు వస్తున్నామని కోకాకోలా సంస్థ ప్రకటించింది.
ఇందుకు గాను పొబొకో అనే మరో సంస్థతో ఒప్పందం చేసుకుందట.కాగా కోకాకోలా కంపెనీ ప్యాకేజింగ్ ఇన్నోవేషన్ మేనేజర్ స్టిజన్ ఫ్రాన్సెన్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
రీసైక్లింగ్ చేయగలిగే పేపర్ లేదా ఇతర పదార్థాలతో బాటిళ్లను రూపొందించేందుకు తమ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వెల్లడించారు.
ఇక ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణమవుతున్న సంస్థగా కోకాకోలాకు ఉన్న పేరును చెరిపేసుకుంటుందన్న మాట ఈ సంస్ద.
ఇలాగే మిగతా కంపెనీల వారు కూడా ఆలోచిస్తే పర్యావరణానికి మేలు చేసినవారు అవుతారు.
మోకాళ్ల నొప్పులకు 20 నిమిషాల్లో చెక్.. ఫిట్‌నెస్ ట్రైనర్ సీక్రెట్ రొటీన్ లీక్!