న్యూయార్క్ : అన్న వెనుక నిలబడ్డందుకు ఫలితం.. ఆండ్రూ క్యూమో సోదరుడు క్రిస్‌పై సీఎన్ఎన్ వేటు

న్యూయార్క్ : అన్న వెనుక నిలబడ్డందుకు ఫలితం ఆండ్రూ క్యూమో సోదరుడు క్రిస్‌పై సీఎన్ఎన్ వేటు

లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న న్యూయార్క్ మాజీ గవర్నర్‌ ఆండ్రూ క్యూమోకి సాయం చేశారన్న అభియోగాలపై ఆయన సోదరుడు క్రిస్ క్యూమోకి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్ షాకిచ్చింది.

న్యూయార్క్ : అన్న వెనుక నిలబడ్డందుకు ఫలితం ఆండ్రూ క్యూమో సోదరుడు క్రిస్‌పై సీఎన్ఎన్ వేటు

ఈ వ్యవహారంలో లీగల్ ట్రాన్స్ స్క్రిప్ట్స్‌ విడుదలవ్వడంతో ప్రైమ్ టైమ్ యాంకర్‌గా వున్న క్రిస్ క్యూమోను విధుల నుంచి తొలగించినట్లు సీఎన్ఎన్ మంగళవారం ప్రకటించింది.

న్యూయార్క్ : అన్న వెనుక నిలబడ్డందుకు ఫలితం ఆండ్రూ క్యూమో సోదరుడు క్రిస్‌పై సీఎన్ఎన్ వేటు

కోవిడ్ సమయంలో ఇద్దరు సోదరులు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.అయితే కోవిడ్ మహమ్మారి న్యూయార్క్‌ను ధ్వంసం చేస్తుంటే.

ఆండ్రూ క్యూమో మాత్రం డైలీ ప్రెస్ బ్రీఫింగ్‌లతో గడిపేవారంటూ విమర్శలు వచ్చాయి.ఇదే సమయంలో మాజీ సిబ్బందితో సహా దాదాపు డజను మంది మహిళలను వేధించినట్లుగా ఆరోపణలు రావడం, అటార్నీ రిపోర్ట్ సైతం బయటకు రావడంతో ఆండ్రూ క్యూమో తన పదవికి ఈ ఏడాది ఆగస్టులో రాజీనామా చేశారు.

అలాగే అక్టోబర్‌లో ఆండ్రూ క్యూమోపై లైంగిక వేధింపుల కింద అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

"""/"/ ఇక క్యూమో సోదరుడు క్రిస్ (51) ఆయనను ఈ కేసులో రక్షించేందుకు ప్రయత్నించినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ అటార్నీ జనరల్ కార్యాలయం సోమవారం ట్రాన్స్‌స్క్రిప్ట్‌లు విడుదల చేసింది.

ఇవి క్యూమో కేసుకు సంబంధించి క్రిస్ ప్రమేయంపై కీలక ఆధారాలుగా నిలిచాయని సీఎన్ఎన్ తన ప్రకటనలో తెలిపింది.

క్రిస్ తన కుటుంబానికి తొలి స్థానం, ఉద్యోగానికి రెండవ స్థానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని తమను తాము ప్రశ్నించుకున్నామని సీఎన్ఎన్ వెల్లడించింది.

"""/"/ న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ విడుదల చేసిన ట్రాన్స్‌స్క్రిప్ట్‌లు క్యూమోను రక్షించే ప్రయత్నాలకు సంబంధించి గతంలో బయటకు వచ్చిన దానికంటే ఎక్కువ విషయాలనే చెప్పాయని సీఎన్ఎన్ వ్యాఖ్యానించింది.

ఈ కారణాల చేత తాము క్రిస్‌ను విధుల నుంచి తొలగించామని.తదుపరి చర్యలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎన్ఎన్ పేర్కొంది.

ఆండ్రూ క్యూమో, క్రిస్ క్యూమోలు .మాజీ న్యూయార్క్ గవర్నర్ మారియో క్యూమో కుమారులు.

క్రిస్ క్యూమోను విధుల నుంచి తొలగించిన నేపథ్యంలో మంగళవారం అతని స్థానంలో మరో యాంకర్ ఆండర్సన్ కూపర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అదిరిపోయే రికార్డు కొట్టాడు భయ్యా.. 38 గంటలు బొమ్మలా నిలబడి ప్రపంచాన్ని షాక్..!